నేను 16..నా అనుభవం 64..

 


షడ్రుచులు..


* ఒకసారి ఓ ఊరి జనం వర్షాల కోసం పూజ చేద్దామని మాంచి ఎండలో బయలు దేరారు..అందరూ మామూలుగా వస్తే ఒకే ఒక్కడు గొడుగుతో వచ్చాడు..

అది విశ్వాసం..!

*ఓ తండ్రి తన చేతిలోని బిడ్డను అంతెత్తున ఎగరేసినప్పుడు ఆ పాప నవ్వుతూనే ఉంటుంది...ఎందుకని.. ఎగరేసిన నాన్న ఖచ్చితంగా..సురక్షితంగా పట్టుకుంటాడని ఎరుకే..

అది భరోసా..!

*అసలు రేపు ఉదయం లేస్తామో లేదో తెలియని జీవితాలు..అయినా పెందలకాడే లేవాలని అలారం 

ఫిక్స్ చేసుకుంటాం..

అది ఆశ..!

*రేపు ఎలా ఉంటుందో తెలియక పోయినా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం..

అది నమ్మకం..!

*పెళ్లి చేసుకున్నోడు సుఖ పడిన దాఖలా లేదని చెబుతాం..వింటాం..కానీ పెళ్లి చేసుకుంటాం..

అది విధి..!

*ఒక ఎనభై ఏళ్ల పెద్దాయన చొక్కాపై ఇలా రాసి ఉంది..ఎవరన్నారు నా వయసు ఎనభై అని..నేను 16..నా అనుభవం 64..

అది వైఖరి..!

********

    

           సురేష్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు