సోనియా గాంధి తెలంగాణ నుండి పోటీ చేయాలని ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి విజ్ఞప్తి

 


సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని విజ్ఞప్తిచేస్తూ  కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. గాంధీభవన్‌లో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు ఇతర నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో జరిగిన చర్చలు చేసిన తీర్మాణాలను షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు.

ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నామన్నారు. మిషన్ భగీరథ అవకతవకలపైనా చర్చించినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి గ్యారెంటీ పథకాల అర్హులను ఎంపిక చేస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను నియమించినట్లు వెల్లడించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు