మూలుగు బొక్క కోసం పంచాయితి - చివరికి ఎత్తి పోయిన పెండ్లి

 

A fictional image

బలగం సినిమాలో మూలుగు బొక్క పంచాయితి చూసినం కదా. చాలా మంది ఈ సీన్ పై విమర్శలు కూడ చేశారు. మరి అంత ఎక్కువగా సీన్ క్రియేట్ చేశారని కామెంట్లు చేశారు.  మూలుగు బొక్క పంచాయితి యదార్దంగా జరిగింది. మూలుగు బొక్క చివరికి ఏకంగా నిశ్చితార్దం జరిగిన పెండ్లి లే ఎత్త గొట్టింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన వధువుతో జగిత్యాల జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన వరుడికి పెండ్లి నిశ్చయం అయింది. ఇచ్చిపుచ్చుకునే కట్నకానుకలు అన్ని మాట్లాడుకుని నిశ్చితార్దం పెట్టుకున్నారు.

నిశ్చితార్దం ఫంక్షన్ లో నాన్ వెజ్ పెట్టడం తెలంగాణ ప్రాంతంలో ఆనవాయితి. ఈ  సందర్బంగా భోజనాలు జరుగుతుండగా వరుడి భందువలు ఒకరు మూలుగు బొక్క కావాలని ఆడగడంతో గొడవ ప్రారంభమైంది. తనకు మూలుగు బొక్క పంచాయితి మాటా మాటా పెరిగి ఆఖరికి ఇరుర్గాలు కొట్టుకున్నంత పని కావడంతో  పంచాయితి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. నవంబర్ ఒకటవ తేది నుండి ఈ పంచాయితి కొనసాగింది. మద్యవర్తులు పోలీసులు ఎంతగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఇరువర్గాలు తగ్గలేదు. ఇక తమకు ఈ పెండ్లి కుదరదంటే కుదరని మొండికేసి చివరికి పెండ్లి రద్దు చేసుకున్నారు.  

ఇరువురి పంతాలకు పాపం నిశ్చితార్దం జరిగిన వివాహం రద్దు అయిందని ఈ విషయం అందరూ ఆశ్చర్య పోతూ ముక్కున వేలేసుకున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు