జోడెద్దుల్లా పాలన సాగాలి - పేదల సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించం- సిఎం రేవంత్ రెడ్డి


 ప్రభుత్వ సంకల్పాన్ని అర్దం చేసుకుని అధికారులు ప్రజా ప్రతినిధులు జోడెద్దుల్లా కల్సి పనిచేయాలని పథకాలను  ప్రజల వద్దకు చేర్చే భాద్యత సమర్దవంతంగా నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలీస్ కమీషనర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను వివరించి అమలు చేసేందుకు దశాదిశా నిర్దేశించారు. ప్రజా సేవకు జీవితాన్ని పరిపూర్ణంగా అంకితం చేసిన ఎస్.ఆర్ శంకరన్ సేవలు గుర్తు చేస్తు అధికారులు ఆయనను స్పూర్తిగా తీసుకుని పనిచేయాలని అన్నారు.  

ప్రజా సంక్షేమం కోసం సచివాలయంతీసుకునే ప్రతి నిర్ణయం క్షేత్ర స్తాయిలోకి తీసుకువెళ్లే భాద్యత కార్యనిర్వాహక వర్గానిదే అని అన్నారు. సంక్షేమ పథకాలకు గ్రామసభల్లోనే  లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు.



అధికారులు రోజుకు 18 గంటల పాటు పనిచేయాలన్నారు.అధికారులు ఎవరైనా తమతో పనిచేసేందుకు ఇ్బబందులు పడితే ముందే చెప్పి తప్పు కోవాలని అన్నారు. ప్రతి మూడు నాలుగు నెలలకు గ్రామ సభల పై సమీక్ష జరగాలన్నారు.

పోలీసు అదికారులు నేరాల నియంత్రణకు పూర్తి స్వేచ్చా వాతావరణంలో పనిచేయాలన్నారు. ప్రధానంగా బూ కబ్జాలపై ఉక్కు పాదం మోపాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్‌ మై షో, సన్‌బర్న్‌ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలని సూచించారు. సన్‌బర్న్‌ ఈవెంట్‌ను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాయన్నారు.. వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టవద్దని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు