ఘనంగా కిట్స్ వరంగల్ కాంపస్ లో సిల్వర్ జూబ్లి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 


కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో ఘనంగా సిల్వర్ జూబ్లీ బ్యాచ్ (1998)  పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది.  ఈసందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో  కిట్స్ వరంగల్  పూర్వ విద్యార్థులు సీనియర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ యం. వీరా రెడ్డిని ఘనంగా  సత్కరించారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజి రాజ్య సభ సబ్యులు కళాశాల  చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు , కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గం మాజి శాసన సబ్యులు కళాశాల అడిషనల్ సెక్రటరీ, వి. సతీష్ కుమార్ యాజమాన్య సభ్యులు ఇ. వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతో కాళాశాల పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా చాటారని వారిని అభినందించారు. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  ముఖ్య అతిథి గా హైదరాబాద్ కి చెందిన కిట్స్‌వా-హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షులు సి.శ్రీధర్‌రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ల కోసం సెమినార్లు, వర్క్‌షాప్‌లు, పారిశ్రామిక సందర్శనలు, లేబొరేటరీలలో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసేందుకు యుజి మరియు పిజి విద్యార్థుల ప్రయోజనాల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు మరియు ఇంటర్న్‌షిప్‌లను నిర్వహించేందుకు తోడ్పడనున్నట్లు తెలిపారు. 

 విద్యార్థులు కోర్ మరియు లేటెస్ట్ టెక్నాలజికల్ సిస్టమ్స్‌లో శిక్షణ పొందినట్లయితే, వారు వారి కెరీర్‌లో విజయం సాధిస్తారని అన్నారు.  విద్యార్థులు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత నివ్వాలని స్థిరమైన  బలమైన సంబంధాలు బల పడేలా  స్నేహాన్ని కొనసాగించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు.

కళాశాల  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి  మాట్లాడుతూ కిట్స్ వరంగల్ పూర్వ  విద్యార్థులు సి సి ఈ ఓ లుగా, గొప్ప పారిశ్రామిక వ్యవస్థాపకులుగా, ప్రపంచ స్థాయి ఇంజనీర్లుగా గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.  కిట్స్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో పాటు  ధృడ సంకల్పం కలిగిన పూర్వ విద్యార్థుల కారణంగా కళాశాల ఖ్యాతిని గడించిందని అన్నారు.  కళాశాలలో విద్యార్జనతో పాటుగా ఇతర అన్నిరంగాలలో ప్రతిభావంతులుగా తీర్చి దిద్దే వాతావరణం కళాశాలలో కల్పించామని అన్నారు. ఎవరూ పుట్టుకతో  పరిపూర్ణులు కాలేరని జ్ఞానం ఆర్జించడం ద్వారా వృద్ది లోకి వస్తారని  ఆర్జించడం అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయికి ఎదిగిన  1998 తరగతి సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థులకు  అభినందనలు తెలిపారు.



 1998 బ్యాచ్ కు చెందిన 150 మంది పూర్వ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రాచ్యాత్య  దేశాల నుండి 250 మంది పూర్వ విద్యార్థులు  దేశవ్యాప్తంగా వివిద ప్రాంతాల నుండి హాజరయ్యారు. 

పూర్వ విద్యార్థులు తమ అధ్యాపకులైన ప్రొఫెసర్ కె. శివాని, ప్రొఫెసర్ వి రామయ్య,  ప్రొఫెసర్ నిర్మలాదేవి, ప్రొఫెసర్ ఆర్ రవీందర్ రావు, ప్రొఫెసర్ కె రాజా రెడ్డి,  కె శ్రీనివాస్ వంటి వారికి జ్ఞాపికలు అంద చేసి మెమెంటోలతో సత్కరించారు.

 ఈ కార్యక్రమంలో కళాశాల రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, పూర్వ విద్యార్థుల  అఫైర్స్ అండ్ ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ ప్రొఫెసర్ ఇన్‌ఛార్జ్  డా. యం. శ్రీకాంత్,   ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, అసోసియేట్ ప్రొఫెసర్, డా. ఓ. ఆంజనేయులు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పారిశ్రామిక వేత్తలు గా ఎదిగిన పూర్వ విద్యార్థులు  కిట్స్‌వా-నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, వివిధ విభాగాల డీన్లు, వివిధ విభాగాల హెడ్స్,  హెడ్, పిఎస్‌డి  అండ్ పిఆర్‌ఓ డాక్టర్ డి.ప్రభాకరా చారి, అధ్యాపకులు, సిబ్బంది హాజరయ్యారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు