శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రేస్ - శాసన సభలో వాడి వేడి చర్చ

రాష్ట్రంలో  మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు

ఉలిక్కి పడ్డ బిఆర్ ఎస్ నేతలు




బిఆర్ఎస్ తొమ్మిదన్నర ఏండ్ల పాలనా కాలంలో చేసిన అప్పులపై కాంగ్రేస్ ప్రబుత్వం శ్వేత పత్రం విడుదల  చేసింది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సభలో శ్వేతపత్రం విడుదల చేశారు.

రాష్ట్రంలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడువందల యాభై ఏడు వేల శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..*

 

*రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.*

 

*2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.*

 

*2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.*

 

*2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.*

 

*2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.*

 

*2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.*

 

*బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.*

 

*57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.*

 

*రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.*

 కోట్ల అప్పుల భారం మోపారని శ్వేత పత్రంలో పేర్కొన్నారు.

 

శ్వేతపత్రం పూర్తిగా తప్పులతో కూడుకున్నదని  వాస్తవాలు లేవని కేవలం బిఆర్ఎస్ పార్టీని  ప్రజల్లో బదనాం చేసేందుకు ఈ పత్రం విడుదల చేశారని హరీశ్ రావు విమర్శించారు.

సభలో హరీశ్ రావుకు మంత్రులకు మద్య తీవ్ర వాగ్వాదం నడిచింది.

మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ హరీశ్ రావును కౌంటర్ చేసారు.

 ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో కాగ్ నివేదిక లో ఉన్న అంశాలే పొందు పరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   తెలిపారు. 

హరీశ్ రావు సభను తప్పు దోవపట్టించే రీతిలో  ఆధారాలులేకుండా మాట్లాడుతున్నాడని సబ్యులు ఎవరన్నా సభను తప్పుదోప పట్టిస్తే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

బిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యేలు నిర్విరామంగా గొడవకు దిగడంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.

వాదోపవాదాల సందర్బంగా ఎమ్మల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన అనుచత వ్యాఖ్యలపై శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరంవ్యక్తం చేశారు.

బరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.

హరీశ్ రావు వ్యాఖ్యలపట్ల స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బయటి విషయాలు సభలో మాట్లాడటం సభ మర్యాద కాదన్నారు.

హరీశ్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించారు.

 

 

 

  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు