రామప్పకు బొగ్గు బావుల నుండి ముప్పు తప్పించాలి

 


యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి బొగ్గు బావుల ముప్పు నుండి శాశ్వతంగా సంరక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తిచేసారు. 

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన శిల్ప కళాఖండమైన రామప్ప గుడి ని సింగరేణి ఓపెన్ కాస్టు బారి నుండి రక్షించాలని మరియు యునెస్కో నిబంధనల మేరకు అభివృద్ధి చర్యలు చేపట్టాలని కోరుతూ రామప్ప పరిర్ఖణ కమిటి సబ్యుడు రాం మోహన్ రావు  కేంద్ర పర్యాటక శాఖామాత్యులు జి.కిషన్ రెడ్డిని న్యూ ఢిల్లీలో కలిసి విజ్ఞాపన పత్రం అంద చేశారు.

ఈ సందర్భంగ రాం మోహన్ రావు మాట్లాడుతూ  రామప్ప గుడి కి పది కిలో మీటర్ల దూరంలో సింగరేణి కంపెనీ ఓపెన్ కాస్టు మైనింగ్ చేయడానికి గత ఇరవై సంవత్సరాలు గ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

ఈ మధ్య కాలంలో రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించినా ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సిందరేమి సంస్థ  మళ్ళీ  అనుమతుల కోసం తన ప్రయత్నాలను కొనసాగించేందుకు పనులు వేగ వంతం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెల్సిందన్నారు. 

ఓపెన్ కాస్టు తవ్వకాలు గనుక చేపడితే ప్రపంచ ప్రజలందరి గుండెల్లో నిక్షిప్తమయి వున్న శిల్ప కళాఖండం నేల కూలే ప్రమాదమున్నదని ఆవేదన వెలిబుచ్ఛారు.

ఇప్పటివరకు ఇచ్చిన సంస్థల అనుమతులన్నీ రద్దు చేసి రామప్ప గుడిని కాపాడాలని కోరామన్నారు.

అందుకోసం రామప్ప కట్టడాల చుట్టూ 50 కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గ ప్రకటించాలనీ,

దీనితో పాటుగా యునెస్కో నిబంధనల మేరకు ఉండ వలసిన సౌకర్యాల రూపకల్పన ,స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పాలంపేట గ్రామాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనీ,ఇక్కడే గల జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాంతానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలనీ కోరామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు