ఖజానా ఖాళీ - అప్పుల కుప్పగా రాష్ట్రం - వ్యూహాత్మకంగా కాంగ్రేస్ శ్వేత పత్రం

 వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రేస్ 

ఎదురు దాడిలో బిఆర్ఎస్

 ఆర్థిక పరిస్థితులు వెల్లడిస్తే  రాష్ట్రం ఇమేజ్ డామేజి అవుతుందని వితండ వాదం

కాంగ్రేస్ర్సె వర్సెస్ బిఆర్ఎస్ మద్యలో మజ్లీస్


అధికారంలో కి వచ్చిన కాంగ్రేస్ పార్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో  రాష్ర్ట ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసి బిఆర్ఎస్ పార్టీ డొల్లతనాన్ని బయట పెట్టింది. విద్యుత్ రంగంలో కూడ జరిగిన అపసవ్య విధానాలను ఎత్తి చూపింది.

కాంగ్రేస్ పార్టీని ధీటుగా ఎదుర్కుంటున్నామని  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతృప్తి చెందుతున్నా  ఆ పార్టీ ఆర్థిక అరాచకం ఎట్లా సాగిందో  ఫోకస్ చేస్తూ ప్రజల ముందు నిల బెట్టే ప్రయత్నం చేసింది.   

తొమ్మిదన్నరేళ్ల  బిఆర్ఎస్ పాలనలో పాలన అంతా అప్పులతోసాగిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి  70 వేలకోట్ల  అప్పులతో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులకు చేరిందని శ్వేతపత్రంలో  వివరించింది.

శ్వేతపత్రంలో అంకెలలో తప్పులున్నాయని బిఆర్ఎస్ పార్టీతో సహా  ఆ పార్టీకి మిత్ర పక్షంగా ఉండే ఎంఐఎం పార్టి కాంగ్రేస్ పార్టీని  ఇరుకున పెట్టాలని అడుగడుగునా విశ్వప్రయత్నాలు చేసాయి. 

అయితే కాంగ్రేస్ పార్టి మాత్రం  డైవెర్ట్ కాకుండా  ఖజానా లో నయాపైసా లేకుండా ఊడ్చేసారనే సందేశం ప్రజల్లోకి పోయేలా బాగా ఫోకస్ చేసింది.   

కరెంటు రంగంపై కూడ శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రేస్ పార్టి మొత్తం అప్పు 81,516 కోట్లు గా ప్రకటించింది.

రాష్ట్ర మనుగడకు, విద్యుత్ రంగం పరిస్థితి ప్రజలకు తెలియజేయడానికి ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడంలేదని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు.

2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు రూ.62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలయిందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బిఆర్ఎస్ పార్టి, మజ్లీస్ రెండూ అధికార కాంగ్రేస్ పార్టీని కార్నర్ చేయాలని ప్రయత్నాలు చేశాయి. 

బిఆర్ఎస్, మజ్లీస్  బొమ్మా బొరుసు  



ఈ సమావేశాల్లో ఈ రెండు పార్టీలు ఒక దాని కొకటి అండ దండాగ నిలిచాయి. అక్బరొద్దీన్ ఓవైసి తన వాక్పటిమతో  కాంగ్రేస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టి ఇరుకున పెట్టాలని చూసినా రే వంత్ రెడ్డి సమర్ద వంతంగా తిప్పి కొట్టారు.
షబ్బీర్ అలీని, అజారుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి మజ్లీస్  ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

  కాంగ్రెస్ పార్టి మైనార్టీ ముఖ్యమంత్రులను, మైనార్టీ రాష్ట్రపతులను చేసిందని  గుర్తు చేసారు.
అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు... మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్ళిష్టం.. కానీ తమకు పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడాలు లేవన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా ఇబ్బంది లేదని, ఆయన ఆరుసార్లు గెలిచారని, అందుకే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోసమేమో... కరెంట్ కోసం ఆందోళనలు జరగడం లేదని చెబుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదని... ఆయన కేవలం మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడని చురక అంటించారు.


విద్యుత్ అవకతవకలపై న్యాయ  విచారణ

విద్యుత్ రంగంలో అవకతవకలపై సిట్టింగ్ జడ్తితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.  తామేతప్పు చేయలేదని మాజి మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాదిస్తూ విచారణ జరిపించండని డిమాండ్ చేయడంతో అందుకు అంగీకరిస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేశామని రేవంత్ రెడ్తెడి లిపారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మీ ఉద్దేశాలు ఏమిటో విచారణలో తేలుతాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. కేంద్రం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా... అధిక ధరకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. రెండో అంశంగా 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై కూడా విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. 
అక్బరుద్దీన్ అన్ని విషయాలు చెబుతున్నారు కానీ పాతబస్తీలో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత తనది అని మాత్రం చెప్పడం లేదని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట, గజ్వేల్ టాప్‌లో ఉన్నాయన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి ఎనిమిది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఫాతిమా అనే ముస్లిం ఉంటే మజ్లిస్ పార్టీ కనీసం ఆమె గురించి మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు