పార్టి ఓటమి పై బిఆర్ఎస్ ఎమ్మెల్సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు

 


మాజి ఎమ్మెల్యేలకు భద్రత అవసరంలేదు -కుక్కలు కూడ వెంట పడవు



బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నేతలకు మద్యలో పదవుల కోసం వచ్చి చేరిన వారికి మొదటి నుండి విభేదాలు ఉన్నాయి. ఉద్యమ కారులను కాదని మద్యలో పార్టీలు మారి వచ్చిన వారికి టెకెట్లు పదవులు ఇచ్చి కెసిఆర్ వారికి పెద్ద పీట వేయడం ఉద్యమ నేతలకు మొదటి నుండి గిట్టని అంశం.

అయితే పార్టి అధినేతను ఎవరూ ఎదిరించి ప్రశ్నించే సాహసం ఇన్ని రోజలు జరగలేదు. ఇప్పుడు మూడో దఫా ఎన్నికల అనంతరం పార్టి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో  కూర్చోవాల్సి రావడంతో  ఉద్యమ నేతలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పారాటి పరిస్థితులు చక్క దిద్ది ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.


వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ   తక్కెళ్లపల్లి రవీందర్ రావు నోరు తెరిచి పార్టి వైఫల్యాలపై మొదటి సారి విమర్శలు చేశారు. 

బిఆర్ఎస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై మాట్లాడుతూ ఇదంతా పార్టి నాయకత్వం వైఫల్యమని అన్నారు. వరంగల్ జిల్లా ఆత్మ గౌరవం కలిగిన  జిల్లా అని  మంత్రుల పట్ల అసహనంతో ఓడించారని అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా వారితో మాట్లాడిన రవీందర్ రావు ఆవేదనతో, భాదతో కూడిన ప్రశ్నలు వేసారు.

రవీందర్ రావు చాలా కాలం పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి  ఆ తర్వాత రాష్ర్ట స్థాయి నేతగా ఎదిగారు.


ఎర్రబెల్లి దయాకర్ రావు కి, సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారని అన్నారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ప్రశ్నించిన ఆయన అధినేత వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారు అని స్పష్టం చేశారు. అధినేత కెసిఆర్ ఎవరు చెప్పేది వినలేదు అన్న అభిప్రాయాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు. వాస్తవాలు చెప్పే వారు బయట, భజన గాళ్ళు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయి అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఖమ్మం జిల్లాలో పార్టి పరిస్థితులపై మాట్లాడుతూ బయటి పార్టీల నేతలను పార్టీలో చేర్పుకోవడంతో గ్రూపులు ఏర్పడ్డాయని  ఓటమికి కూడా ఇదే కారణమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు విశ్లేషించారు. ఎర్రబెల్లి ని మంచి లీడర్ అనికితాబిస్తే ప్రజలు ఉరికించి కొడతారని అ్ననారు.

 ఎర్రబెల్లి దయాకర్ రావుకు చక్కిలిగింతలు పెట్టడం తప్ప ఎవ్వరికీ రూపాయి సహాయం చేసిఎరుగరని అన్నారు.  పార్టీ ఎమ్మేల్యేల ప్రవర్తన కారణంగానే ప్రజల్లో  వ్యతిరేకత పెరిగిందని చెప్పుకొచ్చారు.

మాజి ఎమ్మెల్యేలకు భద్రత తొలిగించిన విషయంలో మాట్లాడుతూ వారికి భద్రత అవసరం పడదని  ఊర కుక్కలు కూడ వారి వెంట పడవని  అన్నారు.

రవీందర్ రావు వ్య్కలు పార్టి వర్గాల్లో చర్చ నీయాంశంగా మారాయి. అయితే బహిరంగంగా ఆయన చేసినవ్యాఖ్యల్లో  నిజం ఉందని పార్టి నేతలు సమర్దిస్తున్నారు. పార్టి  సమీక్షల్లో సైతం ఉద్యమనేతలు ఈ విషయాలను పార్టి నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారని సమాచారం. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు