తెలంగాణలో భాజపా గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తాం ...కేంద్ర మంత్రి అమిత్ షా

   


రాష్ట్రంలో  భారతీయ జనతా పార్టి అధికారంలోకి వస్తే బిసినేతను ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో జరిగిన  పార్జటి జన గర్జన సభలో అమిత్ షా  ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రానికి భారత రాష్ర్ట సమితి పార్టి  కాంగ్రేస్ పార్టి చేసింది ఏమి లేదని ప్రధాన మంత్రి నరేం్దర మోది నాయకత్వంలో మాత్రమే  తెలంగాణ అభివృద్ది సాద్యమని అన్నారు.


బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీలకు ప్రజల సంక్షేమం ఏ మాత్రం పట్టదని కెటిఆర్ ను ముఖ్యమంత్రిని  చేయాలని కెసిఆర్ ఆలోచిస్తున్నాడని రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని సోనియా గాంధి చూస్తున్నారని అమిత్ షా విమర్శించారు.

దేశంలో వారసత్వ రాజకీయాలకు దూరంగ ాఉన్న ఒకే ఒక్క పార్టి బారతీయ జనతా పార్టీ అని పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీ అని అన్నారు.


బిఆర్ఎస్  పార్టీని విమర్శిస్తూ  ఆ పార్టి పేదల వ్యతిరేక పార్టీ అని, దళితుల వ్యతిరేక పార్టీ అని గతంలో దళితులకు హామీలు ఇచ్చి మోసం కెసిఆర్ మోసంచేసాడని విమర్శించాడు. కెసీఆర్   మరో సారి గెలిస్తే  దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైందో కెసిఆర్  చెప్పాలని అన్నారు.  దళితుల అభివృద్ధి కోసం కెటాయిస్తామన్న 50 వేల కోట్లు ఎమాయయ్యాయో చెప్పాలన్నారు. పది వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అన్నారని ఆ నిదులు  ఏం చేశారో చెప్పాలన్నారు

బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేసారు. తెలంగాణలో కేంద్రం చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ  సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం  ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు పరిరక్షించేందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ప్రధాన  మంత్రి నరేంద్ర మోది ప్రత్యేకంగ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారని అమిత్ షా తెలిపారు.

జన గర్జన పేరుతో సూర్యపేటలో ఈ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌ సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామాలయం గురించీ తన ప్రసంగంలో ప్రస్తావించారు అమిత్ షా. శ్రీరామచంద్రుడు 550 సంవత్సరాల పాటు ఓ చిన్న డేరాలో నివసించారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం శ్రీరాముడికి అద్భుత ఆలయాన్ని నిర్మిస్తోందని, జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని అన్నారు.



https://youtu.be/jmnQq4NIcr0

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు