బిసి సిఎం మంత్ర .. తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపనతో భారతీయ జనతా పార్టి ఎత్తుకున్న ఓ ఆకర్షణీయ నినాదం
ఎన్నికల
ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్
షా సూర్యపేట సభలో ప్రకటించిన మంత్రం
భారతీయ
జనతా పార్టి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించారు
ఇది
తెలంగాణ ప్రస్తుత రాజకీయాలలో చర్చనీయంగా మారింది
బిజెపి
మంత్రం ఎంత వరకు ఫలిస్తుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా బిసీలకు మాత్రం ఇది ఓ
ఆశను రెకెత్తించే అంశమే
కాకపోతే
బీజెపి ఈ ప్రకటన కొద్ది రోజులకు ముందు చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి
తీరా
ఎన్నికల సమయంలో ప్రకటించడం వల్ల ఎంత వరకు ప్రయోజన మనేది ప్రశ్న.
తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు అయితే
ఉండేవి.
ఆ
పార్టి ఎందుకో ఎవరికి అర్దంకాని రీతిలో
గందరగోళంలో పడిందా ...లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా...
గతంలో
చూసినట్లైతే రెండువేల పద్దెనిమిది ఆసెంబ్లీ
ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లి సీటు గెలిచిన బీజెపి ఆ మరుసటి
సంవత్సరమే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో నాలుగు ఎంపీ సీట్లు
గెలుచుకుంది
అయితే
ఈ పరిస్థితులను పార్టి కాపాడుకోవడంలో విఫలం అయింది
తెలంగాణలో
బీజెపి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందని అంతా భావించారు
ఓ
దశలో కాంగ్రేస్ పార్టి పూర్తిగా ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.
బీఆర్ఎస్, కాంగ్రేస్ రాజకీయాలు నచ్చని వారు అనేక
మంది బీజెపీలో చేరారు
బిఆర్ఎస్ పార్టీలో నంబర్ టూ గా ఉన్న బిసి నేత
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం పార్టీకి బాగా కల్సి వచ్చింది.
బీజేపీ
పార్టీ అధ్యక్షులుగా కొనకాగిన కాపు
సామాజిక నేపద్యం ఉన్న లక్ష్మన్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్
ఎంపీ బండి సంజయ్ ను నియమించిన తర్వాత బీజేపీ బాగా పుంజుకుంది.
కెసిఆర్
లెక్కనే తెలంగాణ యాసతో మాట్లాడే బండి సంజయ్ దూకుడు పార్టీకి
బాగా
కల్సి వచ్చింది.
ఈటల
రాజేందర్, బండి సంజయ్ ఇద్దరూ తెలంగాణా లో బిసి
వర్గానికి చెందిన సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కులాల నుండి వచ్చిన వారు కావడంతో
బీసీలంతా ఆ పార్టి వైపు మొగ్గు చూపారు
బీఆర్ఎస్
, కాంగ్రేస్ పార్టీలకు భిన్నంగా
బీజేపీ బీసీలకు పార్టీలో మంచి అవకాశాలు
కల్పిస్తోందని ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు
ఈ
ఊపులోనే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో
పాటు ప్రటిష్టాత్మకమైన హుజురాబాద్ సీటు గెలుచుకుంది.
హైదరాబాద్
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నువ్వా
నేనా అన్న రీతిలో గట్టి పోటి ఇచ్చి
అత్యధిక స్థానాలు గెలిచింది.
తెలంగాణాలో
అధికారంలోకి రావడమే టార్గెట్ గా బీజేపి దూసుకు పోయే క్రమంలో కెసిఆర్ కుటుంబాన్ని
కూడ టార్గెట్ చేసి అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించింది.
స్వయంగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోం
మంత్రి అమిత్ షా సిఎం కెసిఆర్ కుటుంబ అవినీతిని ఎత్తి చూపి విడిచి పెట్టబోమంటూ
హెచ్చరించారు.
కెసిఆర్
కూతురు కవిత లిక్కర్ కేసు వ్యవహారం కొద్ది రోజులు రక్తి కట్టించింది
చాలా
రోజులు బీఆర్ఎస్, బీజేపి మద్య ప్రచ్ఛన్న యుద్దం
కొనసాగింది
ఈ
పరిస్థితులన్ని కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం తారుమారయ్యాయి.
ఆ
రాష్ట్రంలో బిజేపి అధికారం కోల్పోయి కాంగ్రేస్ పార్టి రావడంతో
తెలంగాణాలో పరిస్థితులు ఎవరూ ఊహించన విదంగా మారి పోయాయి.
సడెన్
గా బండి సంజయ్ ని పార్టి అధ్యక్ష పదవి
నుండి తప్పించారు
ఇది
బీజెపీకి తెలంగాణ లో భారి నష్టం
కలిగించింది.
ఘోరంగా
అవమాన కర రీతిలో బండి సంజయ్ పై అవినీతి అరోపణలు కూడ ప్రచారం జరిగాయి.
ఆయన
స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షులుగా నియమించారు.
బిసి
నేతను మార్చి రెడ్డి సామాజిక నేతను పార్టి అధ్యక్ష పదివి లో నియమించడం వల్ల
పార్టీకి ఎంతగా నష్టం కలిగిందో బీజెపీకి తెల్సి వచ్చేందుకు ఎంతో సమయం పట్టలేదు.
కిషన్
రెడ్డి విధానం వేరు...స్వతహాగా ఆయన దూకుడు ప్రదర్శించే నేత కాదు
బండి
సంజయ్ స్టైలు వేరు...పార్టి ఈ విషయాలన్ని గ్రహించి తీరా ఎన్నికలు సమీపించిన సమయంలో
బిసి ముఖ్యమంత్రి మంత్రంతో దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం వల్ల పార్టీకి ఎంత వరకు
లాభం చేకూరుతుందనేది అంచనా వేయలేని పరిస్థితి.
ఈ
ప్రకటన ఓ ఆరునెల్లముందు అయినా చేసి ఉంటే బండి సంజయ్ ను తప్పించకుండా ఉంటే
పరిస్థితి మరో విదంగా ఉండేది.
బండి
సంజయ్ స్థానంలో ఈటలను నియమించినా మంచి ఫలితం ఉండేది.
తీరా
ఎన్నికల సమయంలో బిసి సిఎం నినాదం ఎత్తు
కోవడం వల్ల బీజేపీకి కల్సి వచ్చే అంశాలు పక్కన పెడితే ఆ పార్టీని బీసీలు ఈ సమయంలో ఎంత వరకు విశ్వసిస్తారనేది చూడాలి
రాష్ట్రంలో
కాంగ్రేస్ పుంజుకుందని టాక్ నడుస్తున్న తరుణంలో బీజెపి అంచనాలు ఏమిటనేది ఎవరికి
అర్దం కావడం లేదు.
ఒక వేళ హంగ్ వస్తుందనే అంచనాతో
బీజెపి బిసి సిఎం మంత్రం ముందుకు
తెచ్చి ఉంటుందా అనే అంశంపై కూడ చర్చ జరుగుతోంది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box