గజ్వేల్ లో కెసిఆర్పై పోటీకి సిద్దం....రాజగోపాల్ రెడ్డి


 కాంగ్రేస్ పార్టి అధిష్ఠానం అంగీకరిస్తే  గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పైనా పోటీకి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు

బుధవారం సాయంత్రం మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

కేసీఆర్ కి దమ్ముంటే మునుగోడులో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

 ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని తాను చెప్పలేదని, అవన్నీ పుకార్లని రాజగోపాల్ రెడ్డి కొట్టి పడేసారు.


తెలంగాణ సమాజానికి మేలు చేసెందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

 కాంగ్రెస్ తోనే సామాజిక తెలంగాణ సాకారం అవుతుందని  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ కాంగ్రేస్ పార్టీ అని అన్నారు.

కేసీఆర్ దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, కేసీఆర్ ని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

భారతీయ జనతా పార్టీలో జీవిత కాలం ఉండాలని ఆ పార్టీలో చేరానన అయితేతన అంచనాలు ఆ పార్టీలో ఫలించలేదన్నారు. సిఎం కెసిఆర్ పై చర్యలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టి చర్యలు తీసుకోక పోవడం తనకు భాద కలిగించిందని అన్నారు.  తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థుతుల చూసి ఆలోచనలు మార్చుకున్నానని మునుగోడు ప్రజలు కాంగ్రేస్ పార్టీలో చేరాలని కోరిన మేరకే ఆపార్టీలో చారాలని  నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబం తప్పా ఎన్ని వర్గాల ప్రజలకు  ఇబ్బందులు తప్పడం లేదన్నారు.

అసెంబ్లి ఎన్నికల్లో తమ బార్య పోటి చేయబోదని ఆమెకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇష్టం  లేదన్నారు. తనకు ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలతోనే ఉంటానన్నారు. తెలంగాణ లో కాంగ్రేస్ పార్టి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ మారినపుడు తనపై కొందరు దుష్ప్రచారం చేసారని సిఎం కెసిఆర్ తనకు కాంట్రాక్టులు ఇస్తామంటే తీసుకోలేదని పదవులకోసం పైసల కోసం అమ్ముడు పోయే రకం కాదని అన్నారు. మునుగోడులో తన ఓటమి జరగలేదని తన భయంతో మనుగోడుకు నిధుల వచ్చాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు