ఆదిపురుష్ సరికొత్త యాగమా.. యాగమా..ప్రయోగమా..!

(ఇది సినిమా చూసి రాసిన రివ్యూ కాదు..ఈ సినిమా గురించి విన్నదీ..ఈరోజున చూసిన రివ్యూలను
అనుసరించి రాసిన 
ఓ విశ్లేషణ..)
సరికొత్త యాగమా..
యాగమా..ప్రయోగమా..!?

_________


ఒక ఎన్టీఆర్..


కాంతారావు..

శోభన్ బాబు..

బాపూ సీతాకళ్యాణం రవి..


యావత్ భారత దేశాన్ని ఆకట్టుకున్న అరుణ్ గోవిల్..


నిన్న మొన్న అయ్యకి దగ్గరగా బాలకృష్ణ..


ఈ రాములు అందరికీ భిన్నంగా..వారి కంటే గొప్పగా

శ్రీరామచంద్రమూర్తిని ఆవిష్కరించాలన్న ప్రయత్నం అనాలేమో..

                  ఆదిపురుష్..


అంజలీదేవి..

సరోజాదేవి..

దేవిక..

చంద్రకళ..

జయప్రద..


సాధ్వీలలామ..

జనకరాజ సుత..

హిందువుల 

ఆరాధ్యదేవత సీత..

ఒక్క పాత్రతోనే దేశప్రజల

హృదయాలను చూరగొన్న

దీపికా చికిలియా..


నిన్న గాక మొన్న నయనతార..


ఎస్వీఆర్..

ఎన్టీఆర్..

సత్యనారాయణ..


రామానంద్ సాగర్ 

అరవింద్ త్రివేది..


వీరందరి కంటే అద్భుతం 

అనిపించాలనుకుని

అజయ్ దేవగన్ తో ఒక విఫల ప్రయోగమేమో


ఆదిపురుష్..


రాజనాల..

ఆర్జా జనార్ధనరావు..


హిందీ రామాయణ సీరియల్

అంజనీపుత్రుడు

దారాసింగ్..


కొత్త రూపంలో 

వాయునందనుడు..

లంకాదహనమా..

పురాణ పాత్రల 

ఔచిత్య హననమా..


ఈ ఆదిపురుష్..


భరతజాతి ఇంతకు 

మునుపెన్నడూ చూడని 

ఒక విజువల్ అద్భుతంలా

రామాయణాన్ని కొత్త రకంగా

చూపిద్దామని రౌత్  చేసిన ప్రయత్నం రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని చవి చూడబోతోందో గాని మొదటిరోజు టాక్..టిక్ టాకే..అటూఇటుగానే ఉంది.

దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మాటెలా ఉన్నా

తెలుగు ప్రేక్షకులు రామాయణాన్ని సినిమా రూపంలో ఎన్నో విధాలుగా

ఆస్వాదించారు..లవకుశ..

సీతారామకళ్యాణం..

సంపూర్ణరామాయణం..

రామాంజనేయయుద్ధం...

పాదుకాపట్టాభిషేకం..

వీరాంజనేయ.. 

సీతాకళ్యాణం..

గుణశేఖర్..ఎమ్మెస్ రెడ్డి అద్భుత సృష్టి బాలరామాయణం..

మొన్నటికి మొన్న

బాపూ రామరాజ్యం..

ఇలా ఓ పరంపర..

ఈ కళాఖండాలలో భాగస్వాములైన నిర్మాతలు...నటులు..దర్శకులు..రచయితలు..సంగీత దర్శకులు..గాయకులు..ఎందరో టెక్నీషియన్లు..ఎందరో మహానుభావులు..అందరికీ

వందనాలు..!


అసలు ఎన్టీఆర్ ను తప్ప మరొకరిని రాముడి పాత్రలో

ఊహించలేని జనం అదే ఎన్టీఆర్ తాను రాముని పాత్ర వెయ్యకుండా హరనాథ్ చేత వేయించి అపూర్వంగా సీతారామకళ్యాణం సినిమాని రక్తి కట్టిస్తే బాపూ సంపూర్ణరామాయణం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీసి శోభన్ బాబును

అందాలరాముడుగా ఆవిష్కరించారు.అదే బాపూ రవి అనే కుర్రాడిని వెతికి పట్టుకుని అతగాడు అభినయంలో న్యాయం చెయ్యకపోయినా తన 

కళాకౌశలంతో అదే రవి రాముడిగా రెండు సినిమాలను రక్తి కట్టించారు.

బాలకృష్ణ వయసు కొంత ముదిరినా..తన ఓపిక తగ్గినా శ్రీరామరాజ్యం పేరిట మరోసారి లవకుశ సినిమానే తీసి తన మార్కులో మెప్పించగలిగారు సత్తిరాజు బాపు..!


తెలుగులో మహామహులు రాముని పాత్రను పోషించి అలరించగా..ఎన్టీఆర్ బొమ్మ తెలుగు వారందరి గుండెల్లో శాశ్వతంగా శ్రీరాముని రూపుగా ప్రతిష్టించుకున్నా రామానంద సాగర్ రామాయణంలో అరుణ్ గోవిల్ను తెలుగు వారు కూడా 

ఆదరించి బ్రహ్మరథం పట్టారంటే అది సాగర్.. గోవిల్..దీపికా చేసుకున్న అదృష్టం.. వారి శ్రమకు దక్కిన ఫలితం..!


వెండితెరపై రాముని ప్రస్థానం ఇలా ఉండగా ఊహ తెలిసినప్పటి నుంచి మనం

తెరపై ...పుస్తకాల్లో.. క్యాలండర్లలో..ఫోటోల్లో..

కలల్లో చూసిన రాముడి అవతారం వేరు.ఇప్పుడు రౌత్ అనే నవతరం దర్శకుడు

చేసిన ఆవిష్కరం వేరు..

ఇది జీర్ణం కాని వర్ణం..

ప్రభాస్..అది కూడా బాహుబలి ద్వారా వచ్చిన ఇమేజ్..ఆధారంగా..

రాజమౌళి మొన్నటికి మొన్న మూడు సినిమాల్లో గ్రాఫిక్స్ ద్వారా సాధించిన విజయాల స్ఫూర్తిగా మేనేజ్ చేసి హిట్టు కొట్టాలని ఆశపడితే ఎలా..

ఇది దర్శకుడు రాసుకున్న కథ కాదు..అభూతకల్పన

అంతకంటే కాదు..ఫాంటసీ కానే కాదు..రామాయణం..

భారతీయుల..ప్రధానంగా హిందువుల జీవనాడి..

వాల్మీకి మహాముని విరచిత

మహాద్భుత కావ్యం..

ఎందరో మహానుభావులు ఇప్పటికే కొన్ని అందమైన

ఫ్రేములు కట్టి ఉంచిన

అద్భుత రూపాలు..బాపూ బొమ్మలు..వడ్డాది పాపయ్య

చిత్రవిచిత్రాలు..బాలి కుంచె

నుంచి  జాలువారిన చిత్రరాజాలు..!


రామాయణంలోని ప్రతి సంఘటనపై ఒక అవగాహన..


ప్రతి పాత్రపైనా ఒక అంచనా..మదిలో ప్రతిష్టించుకున్న ఒక రూపం..

ఒక ఉదాత్త భావన..

ఒక గౌరవం..ప్రేమ..

అన్నిటినీ మించి అనిర్వచనీయమైన భక్తి..


వీటన్నిటికీ భిన్నంగా జరిగేది

రుచించడం కష్టమే..ఎంతో రుచిరా..ఎంతో రుచిరా..

అదే రామాయణం..

గ్రంథం అయినా..కావ్యం

అయినా..సినిమా అయినా..

భిన్నం.. విభిన్నం..

ప్రయోగం.. ప్రమాదమే..!


సురేష్..9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు