మనుధర్మ శాస్త్రం వల్లే సమాజంలో అసమానతలు - ప్రొఫెసర్ కాత్యాయిని విద్మహే


 మనుధర్మ శాస్త్రం సమాజంలో వైరుధ్యాలు పెంచుతుందని రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని కుట్రలు చేస్తున్నారని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు.

దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు 16,17,18 తేదీలలో బందెల నరసయ్య, పి సుగుణ అధ్యక్షతన  పి ఆర్ ఆర్ కన్వెన్షన్ లో జరిగాయి. 

 శనివారం మనుధర్మ శాస్త్రం సమాజంలో దాని ప్రభావం పై క్లాసును బోధించిన ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ. భారతదేశంలో మనుధర్మ శాస్త్రం ప్రజల మీద అత్యంత ప్రభావాన్ని చూపించే విధంగా సంఘ్ పరివార్ శక్తులు అయినా ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు సమాజాన్ని మనుధర్మశాస్త్రానితో నింపాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో బిజెపి భారతదేశంలో అధికారంలోకి వచ్చినప్పటినుండి ఈ మను ధర్మ  శాస్త్రాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో భారతదేశ రాజ్యాంగంలో అనేక రకాల చట్టాలను మార్పు చేస్తూ వస్తున్నది. ప్రస్తుత కాలంలో ఉన్న మనం ఈ మార్పులను గ్రహించకపోవచ్చు కానీ భవిష్యత్తులో మనుధర్మ శాస్త్ర ప్రభావం మనమీద అతి ఎక్కువగా చూపుతుందని అదేవిధంగా పౌరుల మధ్య వైశ మ్యాలను పెంచే విధంగా ఈ మనుధర్మ శాస్త్రం కొనసాగుతుందని మరియు స్త్రీలను పూర్తిగా విద్యకు దూరం చేసే విధంగా సామాజికంగా స్త్రీపై వివక్షను చూపే విధంగా పురుష స్త్రీల మధ్య వైశమ్యాలను పెంచే విధంగా ఈ మనుధర్మ శాస్త్రం కొనసాగుతుందని నిత్యజీవితంలో మనం ఎంత శాస్త్రీయబద్ధంగా ఆలోచించిన మనుధర్మ శాస్త్ర ప్రభావం మన మీద ఉంటుందని అది ఎలాగ అంటే దేవుడు దయ్యము స్వర్గము నరకము అనే పదాలను ప్రజలలో జపిస్తూ వారిని అణచిపెట్టే విధంగా సంఘ్ పరివార శక్తులు ప్రయత్నాలు కొనసాగిస్తాయని అన్నారు దళితులను ఐదవ జాతి పౌరులుగా చిత్రీకరించే చాతూర్ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు తల నుండి క్షత్రియులు భుజాల నుండి తొడల నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను పుట్టారని అబూత కల్పనలను ప్రచారం చేయడంలో మనుధర్మ శాస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ సంఘపరివార శక్తులు వాడుకోవడం వల్ల దళితులు పంచమ జాతి వర్ణంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తాయని అన్నారు.

 అందుకే దళిత హక్కుల పోరాట సమితి సభ్యులుగా మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తున్న ఈ బ్రాహ్మణ ఆధిపత్య ఆర్ఎస్ఎస్ బిజెపి సంఘ్ పరివార శక్తులను ఎదుర్కోవడం కోసం సంఘటితమై ప్రజలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలను చేయాల్సిన అవసరం ఉందని ఈ మనుధర్మ శాస్త్రాన్ని నాడు అంబేద్కర్ తగలబెట్టడం ఎంత సత్యమో ఈరోజు దాన్ని అమలు చేయడం కోసం బిజెపి ప్రయత్నాలు చేయడం కూడా అంతే సత్యం ఈ ప్రయత్నాలను అడ్డుకొని తీరాల్సిన అవసరం ఆసన్నమైందని ఆమె తెలియజేశారు. 

సమావేశంలో గౌరవ అధ్యక్షులు కే ఏసు రత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, తాళ్ల పెళ్లి లక్ష్మణ్, కే సహదేవ్, కే రత్నకుమారి, దేవి పోచన్న, జేరుపోతుల కుమారస్వామి, డి హెచ్ పి ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఏలేందర్, జిల్లా కార్యదర్శి జన్ను రవి  ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, ఉప్పలయ్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు