ఫాం హవుజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కెసిఆర్ కు ఎదురు దెబ్బ

  కేసు విచారణను సిబిఐకి అప్పగించిన హై కోర్టు




ఫాం హౌజ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు విషయంలో సిఎం కెసిఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ హై కోర్టు ఆదేశాలు జారి చేసింది.

రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాుటు చేసిన సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన  హైకోర్టు ఈ  కీలక ఆదేశాలు జారి చేసింది. 

దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఎమ్మెల్యేల కొనుగోల్ల కేసు సిఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎమ్మెల్యేలను ఖరీదు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వాలను కూల దోస్తున్నదని ఆరోపిస్తు ఫాం హౌవుజ్ కేసులో కేంద్రాన్ని ఎంతగా బదనాం చేయాలో అంత చేసారు.

అత్యున్నత స్థాయిలో ఉన్న భాజపా నేత సంతోష్ పేరు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. అతన్ని విచారించేందుకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాకుండా తన న్యాయవాదుల ద్వారా  కోర్టును ఆశ్రయించి మినహాయింపు పొందారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కేసు లో సిట్ దర్యాప్తు ఏ మాత్రం ముందుకు సాగని విదంగా తయారైంది.

సిఎం కెసిఆర్ ఈ కేసు విషయంలో మీడియా కాన్ఫరెన్సు ఏర్పాటు చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పైనా, హోం మంత్రి అమిత్ షా పైనా తీవ్ర ఆరోపణలు చేసారు. తానే దర్యాప్తు అధికారిలా సిఎం వ్యవహరించి ఆడియో, వీడియో టేపులు విడుదల చేశారు. బహిరంగ సభల్లో ప్రధానిని నేరుగా దోషిగా చేసి ఆరోపణలు చేశారు.

కేసిఆర్ చేసిన హడావుడి చూసి అంతా ఏదో జరిగి పోతుందని అనుకున్నారు కాని తీరా రోజులు గడిచే కొద్ది  కెసిఆర్ కే పరిస్థితులు ఎదురు తిరిగాయి. ఈ కేసులో ఇ.డి విచారణ చేపట్టి కేసులో కీలకమైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారిస్తోంది. ఇప్పుడు హై కోర్టు ఆదేశలు మేరకు సిబిఐ కూడ రంగంలోకి దిగితే ఇక అసలు కేసు గుట్టు బయట పడుతుంది. కేసులో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. 

ఏమైనా ఈ కేసు విషయంలో సిఎం కెసిఆర్ తలచింది ఒకటి అయితే జరిగింది మరోటి.

ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో  సిఎం కూతురు ఎమ్మెల్సి కవిత సిబిఐ విచారణను  ఎదుర్కుంటోంది. బిఆర్ఎస్ పార్టి ఏర్పాటు చేసిన కెసిఆర్ ఢిల్లీలో కార్యాలయం తెరిచి కేంద్రంపై యుద్దం ప్రకటించారు.

డొంక లాగితే తీగంతా కదులుతుందని భావించిన ఈ కేసులో చివరికి తీగ ఎవరికి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి.

భాజపా నేతలు మాత్రం ఈ కేసును తేలికగా తీసుకోవడం లేదు. తమ పార్టీని బద్ నాం చేసేందుకు పకడ్బందీగా కెసిఆర్ ఆడిన నాటకమని మొదటి నుండి ఎదురు దాడి జరిపారు. కేసును సిబిఐకి అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించారు. మొదట్లో కోర్టు లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్నా ఆ తర్వాత కోర్టు పరిశీలనలో సానుకూల ఫలితాలు వచ్చాయి. 

తాజాగా  హై కోర్టు తీర్పుతో భాజపా నేతలు ఊరట  చెందారు. సిబిఐ విచారణలో కేసు ఎటు నుండి ఎటు మలుపు తిరిగనుందోననే ఆసక్తి నెలకొంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు