శ్రీశైలం సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలభ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు

శీతకాల విడిదికోసం  హైదరాబాద్ వచ్చిన  రాష్ట్రపతికి శంషాబాద్ ఎయుర్ పోర్ట్ నుండి  హెలికాప్టర్ లో నేరుగా  శ్రీశైలం చేరుకున్నారు

రాష్ట్రపతికి ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు


మల్లికార్జున స్వామికి భ్రమరాంభికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాజి స్పూర్తి కేంద్రం సందర్శించారు

చెంచు మహిళలతో రాష్ట్రపతికి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెల్సుకున్నారు

అనంతరం ప్రసాద్ స్కీం కింద నలభై మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన వివిద అభివృద్ది కార్యక్రమాలను రాష్ర్ట పతి  ప్రారంభించారు

ఆ తర్వాత హెలికాప్టర్ లో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ గవర్నర్ తమిళిసాయ్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాగతం పలికారు

రాష్ట్రపతికి భద్రాచలం లోని శ్రీసీతారామ చంద్ర ఆలయంతో పాటు ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు