ఉపాధి హామి పనులపై జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు పిలుపు

 


రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రేపు అనగా 23-12-2022 న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పులుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని పంట కల్లాలను కడితే.. కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత కోసం కల్లాలు నిర్మిస్తే.. మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు.
ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందిన్నారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సర్కారు తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరపున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. .
రైతులకు, వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా.. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు కొనసాగించిందన్నారు.
వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలతో వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందని తెలంగాణ రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్ష కట్టి రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయం అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.
రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు.
రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కేటీఆర్ కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు