పికె, పీఆర్ తో కెసిఆర్ కీలక మంతనాలు

 మూడో దఫా ఎన్నికల్లో గట్టెక్కడమే లక్ష్యం


రానున్న ఎన్నికల్లో గట్టెక్కి అధికారం నిలుపుకునేందుకు సిఎం కెసిఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. జాతీయస్థాయిలో ఓ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పాటు రాష్ట్రంలో భారి మెజార్టీతో విజయం సాధించి అత్యధికంగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని కెసిఆర్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఇందులో బాగంగా ఎన్నికల మేనేజ్ మెంట్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కెసిఆర్ తన ఫాం హవుజ్ లో భేటి అయి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. వారితో పాటు సినిటి నటుడు ప్రకాశ్ రాజ్ కూడ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విపక్షాలను చిత్తుగా ఓడించి  రెండు సార్లు వరుసగా అధికారం చేజిక్కించుకున్న కెసిఆర్ ఈ సారి డౌట్ లో పడ్డారని రాజకీయ విశ్లేషణలు బాగా ప్రచారం అయ్యాయి. కెసిఆర్ స్వయంగా జరిపించుకున్న సర్వేలలో కూడ ప్రజల్లో కెసిఆర్ పట్ల ఆయన పాలనా తీరు పట్ల బాగా  నెగెటివ్ ఉన్నట్లు తేలిందనే  వార్తలు కూడ వచ్చాయి. మూడో సారి  అధికారం నిలుపు కోవడంతో పాటు జాతీయస్థాయిలో  బిజెపీకి వ్యతిరేకంగా ప్రదానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓ ఫ్రంట్ కట్టాలని కెసిఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  

తెలంగాణ లో సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ళ గడువుంది. కాని గడువులోపే కెసిఆర్ ఎన్నికలకు వెళ్ళవచ్చని కాంగ్రేస్, బిజెపీ పక్షాల నేతలు భావిస్తున్నారు. అందుకు తగిన విదంగానే కెసిఆర్ ప్రయత్నాలు కూడ కనిపిస్తున్నాయి. 

తెలంగాణ లో వినూతన శైలిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు రాపలక్పన చేసి బాగా అమలు చేసానని కెసిఆర్ నమ్ముతున్నాడు. భారి సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు ఎత్తి పోతల ద్వారా నీరిచ్చానని  కెసిఆర్ చెప్పుకుంటుంటే  పాలన అధ్వాన్నంగ ఉందని నిరుద్యోగులను సిఎం కెసిఆర్ మోసం చేసారని  ఎన్నికల మాని ఫెస్టోలో ఇచ్చిన హామీలు అనేకం అమలు కాలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

రెండు విడతలుగా అధికారం నిలుపు కో గలిగినా మూడో విడత సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేక భావం ఏర్పడి కెసిఆర్ ను కాదు పొమ్మంటే పరిస్థితి ఏంటనే భయం అయనను వెంటాడు తోంది. అందుకే ఏ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కెసిఆర్ ఈ సారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంచుకుని  కోట్ల రూపాయల ప్యాకేజీతో ఒప్పందం చేసుకున్నాడు. ఇక పీకె బృందం రాష్ట్రంలో తన అధ్యయనం మొదలు పెట్టి వ్యూహాలు రచించ నుంది. నటుడు ప్రకాశ్ రాజ్ కూడ కెసిఆర్  వెంట ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్ప నున్నాడని వార్తలు వస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు