నక్సలైట్లను ఎదుర్కునేందుకు దుర్గా ఫైటర్స్ ఫోర్స్

 

చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మోహరించనున్న మహిళా కమెండోలు


నక్సలైట్లను ఎదుర్కునేందుకు తొలి సారిగా ప్రభుత్వం పూర్తిగా మహిళా కమెండోలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.  చత్తీశ్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో వీరిని మోహరించనున్నారు. ఈ బృందానికి 'దుర్గా ఫైటర్ ఫోర్స్' అని పేరు పెట్టారు.   

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వారిని సమర్థంగా ఎదుర్కోవడానికి తొలి సారి పూర్తి స్థాయిలో మహిళా బృందం ఏర్పాటు చేయండ దేశంలో ఇదే మొదటి సారి.  ఈ 'దుర్గా ఫైటర్ ఫోర్స్' లో మొత్తం 32 మంది మహిళ కమెండోలు ఉంటారు. ఛత్తీస్‌గఢ్ మహిళా కమెండోలు, జిల్లా రిజర్వ్ ఫోర్స్ కలిసి బృందాన్ని ఏర్పాటు చేశారు. నెల రోజుల పాటు కమెండోలకు ఖఠిన  శిక్షణ ఇచ్చి నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు అడవుల్లోకి పంపనున్నారు. సుక్మాను 'నక్సల్స్ రహిత ప్రాంతంగా' తీర్చిదిద్దుతామని 'దుర్గా ఫైటర్స్' కెప్టెన్ ఆశా సేన్ ధీమా వ్యక్తం చేశారు. రాఖీ రోజున తోబుట్టువులు ఒకరినొకరు కాపాడుకుంటామని వాగ్దానం చేసినట్లుగానే మేమందరం సుక్మా ప్రాంత ప్రజలను నక్సలైట్ల నుండి కాపాడతామంటూ మని ఆశాసేన్ తెలిపారు. 


చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా అడవి ప్రాంతం పూర్తిగా నక్సలైట్ల ఏలుబడిలే ఉంది. ఇక్కడ నక్సలైట్ల జనతన సర్కార్ నడుస్తోంది. గిరిజనులు జనతన సర్కార్ ఆదేశాలు పాటిస్తున్నారు.  నకల్స్ కు పెట్టని కోటగా ఉన్న ఈ ప్రాంతంలో నక్సలవైట్లను ఏరివేయడం సాధ్యం కావడం లేదు.  మావోయిస్టులు అక్కడి అటవీ ప్రాంతంలో  పూర్తి పట్టు సాధించి  పోలీసు బలగాలను ముప్పు తిప్పలు పెట్టారు. అనేక ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. నక్సలైట్లను అక్కడి నుంచి తరిమేయడానికి భద్రతా బలగాలు చాలా కాలంగా శ్రమిస్తున్నాయి. పదే పదే భీకర పోరాటాలు జరిగి ఇరువైపులా భారి ప్రాణ నష్టం జరిగింది. పోలీసులు  అడవి ప్రాంతంలో ముమ్మర తనిఖీలు, కూంబింగ్​ చేపట్టినప్పటికీ నక్సలైట్ల ప్రాబల్యం తగ్గడం లేదు. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఎన్ని నిర్బంధాలు విధించినా మావోయిస్టులు సభలు, సమావేశాలు జరగుతున్నాయి. 

మహిళా నక్సలైట్లు ఎక్కువగా ఉన్న సుక్మా జిల్లాలో ఇక దుదుర్గా ఫైటర్స్ ఫోర్స్ ఎంట్రీ అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి.   పురుష కమెండోలకు సాధ్యం కాని ఆపరేషన్ మహిళా కమెండోలు ఎలా సాధ్యం అవుతుందో ఎంత వరకు ఈ వ్యూహం ఫిలిస్తుందోననే ఆసక్తి నెల కొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు