అవినీతిలో నెంబర్ వన్ తెలంగాణ సర్కార్ - మాజి ఐపిఎస్ వీకే సింగ్


 గతంలో జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన మాజి ఐపిఎస్ అధికారి వీకే సింగ్ తెలంగాణ సర్కార్ పైన ముఖ్యమంత్రి కెసిఆర్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. రాష్ట్రం అవినీతిలో దేశలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిజాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్ లో వీకే సింగ్ మీడియాతో మట్లాడారు.  తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఏదైనా చేశారంటే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా మార్చారు. 7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను. ‘జన సేవ సంఘ్’ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను’’ అని వీకే సింగ్ అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బ్యూరోక్రాట్స్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారని అన్నారు.

గతంలో ఆయన జైళ్ల శాఖ డిజీగా ఉన్న సమయంలో కూడ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైళ్లలో ఎక్కువ శాతం మంది ఎలాంటి నేరాలు చేయని బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని వీకే సింగ్ విమర్శించారు. సర్కార్ వ్యవహార శైలితో ఏగ లేక ఇంకా సర్వీసు ఉన్నపప్పటికి స్వచ్చంద పదవి విరమణ చేశారు.  మాజి ఐపిస్ అధికారి ఆర్ ఎస్  ప్రవీణ్ కుమార్ ఇటీవలె పదవికి రాజీమా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రవీణ్ కుమార్ బాటలోనే వీకే సింగ్  కూడ రాజకీయ్లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు