జర్నలిస్ట్ రఘు జైళు నుండి విడుదల

 


హైదరాబాద్ నగరానికి చెందిన వెబ్ ఛానెల్  జర్నలిస్ట్ రఘు మంగళవారం నల్గొండ జిల్లా జైళు నుండి విడుదలయ్యాడు. గుర్రపోడు భూమల గౌడవలో రాజకీయ పార్టీల నేతలతో పాటూ రఘు పే కూడ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

జూన్ 3 వ తేదీన పండ్లు తెచ్చేందుకు వెళ్లిన రఘును మఫ్టీలో వచ్చిన పోీలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు.  రఘును అరెస్ట్ విషయం తెలియక కుటుంబ సబ్యులు, జర్నలిస్టులు ఆందోళన చెందారు. రఘును తామే అరెస్ట్ చేసామంటూ పోలీసులు అనంతరం కుటుంబ సబ్యులకు నోటీసు ఇచ్చారు. రఘు అక్రమ అరెస్ట్ విషయంలో జర్నలిస్టులు పోలీసులు అవలంబించిన విధానాలను తప్పు పట్టారు. 

రఘు కుటుంబ సబ్యులు రఘు అక్రమ విషయాన్ని  లిఖిత పూర్వకంగా  ఫిర్యాదు చేశారు. రఘు బెయిల్ పిటిషన్ పై మిర్యాలగూడ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. 30 వేల జామీనుతో రఘును విడుదల చేశారు.

జైళు నుండి విడుదల అయిన రఘు మీడియాతో మాట్లాడుతు అవినీతి, అక్రమాలపై  ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదన్నారు. తనకు సహకరించిన మీడియా వారికి.. మిత్రులకు.. రాజకీయ పార్టీలకు.. సోషల్ మీడియా సపోర్టర్స్‌కి ధన్యవాదాలు. గౌరవ న్యాయ స్థానం నాకు బెయిల్ ఇచ్చింది.. ఈ సందర్భంగా ఒక విషయం స్పష్ఠంగా చెప్తున్నా.. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జనం సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జర్నలిస్ట్‌లు ఉంటారు. తెలంగాణ జర్నలిస్ట్‌లు తెలంగాణ ఉద్యమం కోసం ఏవిధంగా పనిచేశారో అందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ప్రశ్నించకపోతే.. ప్రశ్నించడం కొనసాగకపోతే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ ప్రశ్నించడాన్ని ఆపను’ అని స్పష్టం చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు