అనందయ్యకు పూర్తి భద్రత కల్పించాలి - సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

 ఆనందయ్య మందు తయారి కేంద్రం సందర్శించిన నారాయణ


కరోనా మందు తయారు చేసిన బొనిగి అనందయ్య కు ప్రాణ హాని ఉందని అతనికి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బొనిగి. ఆనందయ్య కరోనా మందు తయారు చేసే కేంద్రాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించి పరిశీలించారు. 

 ప్రకృతి వైద్యం ద్వారా సామాన్యులకు అందుబాటులో ఉండే విదంగా సులభ మార్గంలో మందు అందుబాటులోకి తెచ్చిన ఆనందయ్యను కాపాడుకోవాల్సివన భాద్యత ఉందన్నారు.  ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు మరింతగా చొరవ తీసుకుని మందుపై స్పష్టత వచ్చేలా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. వంట ఇంటి సరుకులతో ఆనందయ్య సామాన్య ప్రజలకు  వైద్యం చేస్తే కొందరికి గిట్టడం లేదన్నారు.  కార్పోరేట్ వైద్యసంస్థ‌లు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయ‌ని నారాయణ ఆరోపించారు. ఆనందయ్య ఇప్పటి వరకు  70 వేల మంది కి వైద్యం చేస్తే ఒక్క వ్యక్తిని చూపించి ఆనంద‌య్య మందును తప్పు పట్టడం సబబు కాదని పేర్కొన్నారు. నిక్కచ్చగా నివేదికలు ఉండేలా చూడాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు. త్వరితగతిన రీసెర్చ్ పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు.

మన పూర్వకుల నుంచి అందించిన ప్రకృతి ఎంతో అద్భుతమైనదని, ప్రకృతి వైద్యం నుంచే అల్లోప‌తి వైద్యం తయారు అయ్యిందన్నారు. ఆనందయ్య వనమూలికలతతో తయారు చేస్తున్న మందు ఎలాంటి దుష్ప్రభావాలు చూప‌ద‌ని చెప్పారు. ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొనలేనిది ఒక రైతు కనుగొని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాడని ప్ర‌శంసించారు. ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయం అభినందనీయమ‌న్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు