కూరగాయల వ్యాపారిని కొట్టి చంపిన పోలీసు

 యోగి రాజ్యం ఉత్తర ప్రదేశ్ లో పోలీసు ధాష్టీకం


లాక్ డౌన్ లో  రోడ్డెక్కిన వారు పోలీసుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు.

యోగి ఆదిత్య నాద్ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు ఓ కూరగాయల వ్యాపారిని చితగ్గొట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళ లేక ఆ చిరు వ్యాపారి ప్రాణాలు వదిలాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలోని బంగర్‌మవు పట్టణంలో మే నెల 20 న ఈ సంఘటన జరిగింది. ఇంటి బయట కూర్చుని కూరగాయలు అమ్ముతు కనిపించిన ఫైజల్ హుస్సేన్ 18 అనే యువకుడిని పోలీసులు చితక బాదారు. అంతటితో వదిలి వేయకుండా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి హింసించారు. పోలీస్ స్టేషన్ లోనే ఆ యువకుడు కుప్పకూలి చనిపోయాడు. చలనం లేకుండా  పడి ఉన్న  ఫైజల్ మృత దేహాన్ని  ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. 

నా మేనల్లుడు ఇంటి బయట కూరగాయలు అమ్ముతుంటే చౌదరి అనే పోలీసు వచ్చి తీవ్రంగా కొట్టాడు. కింద పడి పోయినా వదిలి పెట్టలేదు. అక్కడున్న వారు అడ్డం వెళలినా వదిలి పెట్టలేదు. తర్వాత తన బైక్ మీద పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి కసి తీరా కొట్టాడు అని ఫైజల్ మేన మామ మిరాజ్ మీడియాకు తెలిపాడు.


పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి మృతదేహంతో ఉన్నావో-బంగర్‌మవు-హర్దోయి రహదారిపై ధర్నాకు దిగారు. యువకుడి మృతికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు.

ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 

మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో  కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తన కూతురుతో కల్సి మార్కెట్ కు వెళ్లగా మాస్కులు ధరించ లేదని ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెపై దాడి చేసి రోడ్డుపై పడేసి భిభత్సం చేసింది. ఈ వీడియో దాశ వ్యాప్తంగా వైరల్  అయింది. సిటిజెన్సు తప్పులు చేస్తే చట్టాన్ని ఉల్లంఘిస్తే థర్డ్ డిగ్రీలు ప్రయోగించే అధికారాలు పోలీసులకు ఎక్కడి వని పౌరులు ప్రశ్నిస్తున్నారు. పరిపాలకులు చేసే పనులకు అమాయక ప్రజలు శిక్షలు అనుభవిస్తున్నారు. లాక్ డౌన్ లో  రోజుల తరబడి ఇంట్లో ఉంటే కుటుంబం ఎలా గడవాలి.. తిండి ఎవరు పెట్టాలి..ఈ ధ్యాస దేశ ప్రధాన మంత్రికి అయినా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అయినా లేదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు