యువకుడిని చెంప దెబ్బ కొట్టి ఉద్యోగం కోల్పోయిన జిల్లా కలెక్టర్


కరోనా కట్టడికి ప్రభుత్వం వాక్సినేషన్ వేగం పెంచే చర్యలకు బదులు జనం ఇబ్బంది పడే  లాక్ డౌన్ ఖఠినంగా అమలుకు పూను కోవడం వల్ల సామాన్యులు అధికంగా నష్ట పోతున్నారు.  రోజుల తరబడి ఇండ్లలో కూర్చుంటే శ్రమ జీవులకు తిండికి దొరకదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏమన్నా అదుకుంటుందా అంటే అది లేదు. మీ చావు మీరు చావండి బయటికి వస్తే మక్కెలు ఇరగ్గొడుతా మంటూ పోలీసులను పెట్టించి లాఠీలతో కొట్టి స్తున్నారు. 

 అన్ని రాష్ట్రాలలో  ఇదే పరిస్థితి నెల కొంది. చత్తీస్ ఘడ్ లో సూరజ్ పూర్ కలెక్టర్ రణబీర్ శర్మ  ఓవర్ ఆక్షన్ చేశాడు.   ఓ యువకున్ని లాక్ డౌన్ నిభందనలు పాటించడం లేదంటూ చెంప దెబ్బకొట్టాడు. అంతటితో ఆగకుండా పోలీసులతో లాఠీలతో కొట్టించాడు.  చెంప దెబ్బ కొట్టి పోలీసులతో  లాఠీతో కొట్టిస్తున్న వీడియో సోషల్ మీడియాలో  బాగా వైరల్  అయింది. ఆయువకుడు బైక్ పై ఓవర్ స్పీడ్ లో వెళుతుంటే ఆపి నట్లు పోలీసులు తెలిపారు.  అయితే తన నానమ్మ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతుంటే వెళ్లి భోజనం ఇచ్చి వస్తున్నానని ఆ యువకుడు తన దగ్గరున్న పేపర్లు చూపించి సంజాయిషి ఇచ్చినా  కలెక్టర్ వినిపించు కోలేదు. ఆ యువకుడు ఫోన్ లో ఏదో చూపిస్తుంటే దాన్ని లాక్కుని నేల పై విసిరి కొట్టాడు. ఆ యువకుడిని కొట్టమని  పక్కనే ఉన్న పోలీసులను ఆదేశించడంతో వారు లాఠీలతో కొట్టారు.  అంతే కాక ఆ యువకుడు బైక్  ఓవర్ స్పీడ్ తో నడిపాడని కేసు నమోదు చేశారు.  

దాంతో కలెక్టర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ జోక్యం చేసుకుని అతన్ని జిల్లా కలెక్టర్  ఉద్యోగం నుండి తొలగించాడు. అతని స్థానంలో గౌరవ్ కుమార్ సింగ్ ను జిల్లా కలెక్టర్ గా నియమించారు. ఓవర్ ఆక్షన్ తో పాపం ఆ ఐఏఎస్ తన కలెక్టర్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది.  కలెక్టర్ తో చెంప దెబ్బ తిన్న  యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణుల చెప్పాడు.

కలెక్టర్ ఉద్యోగం నుండి తొలగించ బడిన  రణబీర్ శర్మ కూడ ఓ  వీడియో విడుదల చేసి  క్షమాపణలు చెప్పాడు. ఆ యువకుడు అబద్దం ఆడినందువల్లే కోపంతో చెంపపై కొట్టానని అన్నారు. గత ఏడాది కాలంగా కరోనా కట్టడికి చాలా చర్యలు తీసుకున్నామని రాత్రిపగలు తనతో పాటు అధికారులు కష్టపడ్డారని తమకు కరోనా కూడ సోకిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ అదికారి చర్యలను ఎవరూ సమర్దించ లేదు. 

దేశ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ లో పోలీసులు ఓవర్ ఆక్షన్ విమర్శలకు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్ లో ఓ యువకుడిని పోలీసులు కొట్టి చంపారు. మద్య ప్రదేశ్ లో ఓ మహిళను కింద పడేసి కొట్టారుు. రోడ్ల పైన కనిపించిన వారిని కారణాలు విచారించకుండా లాఠీలతో చితక బాదుతున్న  వీడియోలు పోలీసుల ప్రవర్తనను ఎత్తి చూపుతున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు