దీక్ష విరమించిన షర్మిల

ముఖ్యమంత్రిపై విమర్శలు - ప్రతి పక్షాలు గాజులు వేసుకున్నాయన్న షర్మిల


ఉద్యోగాలు భర్తి చేయాలని 72 గంటల పాటు దీక్ష చేసిన షర్మిల అదివారం తన దీక్షను విరమించారు. షర్మిల దీక్షను విరమింప చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లి నియోజకవర్గానికి చెందిన బలవన్మరణాలకు పాల్పడిన  కొప్పుల రాజు , మురళీయాదవ్ కుటుంబ సబ్యులను దీక్ష స్థలికి తీసుకు వచ్చారు. వారి చేత నిమ్మరసం ఇప్పించుకుని షర్మిల దీక్ష విరమించారు. రెండేళ్లలో తమ పార్టీ అధికారం లోకి వస్తుందని వైఎస్ షర్మిల భరోసాాగ చెప్పారు. ఏం చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మాటిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా షర్మిల ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు.  నిరుద్యోగులు చనిపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. నిరుద్యోగులు చనిపోతే ఆయన ఛాతీలో ఉన్నది గుండెనా లేక బండ రాయా అని ప్రశ్నించారు. అసలు పాలకులకు చిత్త  శుద్ది ఉందా అని ప్రశ్నించారు.   ఓ మహిళనని కూడ చూడకుండా పోలీసులు తనపై దౌర్జన్యం చేసారని ఆరోపించారు. పోలీసులు లా అండ ఆర్డర్ పాటించడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్డర్లు మాత్రమే పాటిస్తున్నారని అన్నారు. తన చీర లాగారని జాకెట్ చింపారని ఆరోపించారు. లాఠి చార్జి చేసి కార్యకర్తలను కొట్టారని వ్యాన్లలో బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారని పోలీసుల దాడిలో తన చేయి విరిగిందని మరో కార్యకర్త కాలు విరిగిందని  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే తీసుకో లేదని అన్నారు. ఎసిపి శ్రీధర్ మహిళా పోలీసులు తమపై దౌర్జన్యం చేసారని ఆరోపించారు. ప్రసంగం మొదట్లో ప్రతిపక్షాలపై కూడ షర్మిల విమర్శలు చేశారు.  ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారని విమర్శలు చేసారు.  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే వరకు జిల్లాలో కార్యకర్తలు దీక్షలు కొనసాగిస్తారని షర్మిల స్పష్టం చేసారు.


గాడ్దులు కాస్తున్నారా  అంటూ ఇందిరా శోభన్ పై  మండిపడ్డ షర్మిల

కాంగ్రేస్ పార్టి నుండి షర్మిల పెట్టబోయే పార్టీలో చేరిన ఇందిరా శోభన్ కు దీక్ష శిబిరంలో అవమానం ఎదురైంది. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్  అయింది. శిబిరంలో వేదిక పై ఉన్న వారిని వేదికి ఖాళి చేసి వెళ్లి పోవాలని స్వయంగా షర్మిల అసహనం వ్యక్తం చేశారు అప్పుడే అక్కడికి చేరుకున్న ఇందిరా శోభన్ ను కోపంగా చూస్తు మీరంతా గాడ్దులు కాస్తున్నారా అంటూ మండిపడ్డారు. అయితే షర్మిల అట్లా అవమాన పరిచినా ఇందిరా శోభన్ మాత్రం ఆమెను సమర్దించారు. అంటే అనింది కాని అందులో తప్పేమేటని  మీడియా వారిని ఎదురు ప్రశ్నించారు.  అక్కడే సెక్యూర్టి వాళ్లు కార్యకర్తలు ఉన్నారని అంటే తప్పేమి లేదని తన ఆత్మ గౌరవానికి వచ్చిన నష్టం ఏం లేదని  చెప్పు కొచ్చారు. ఇదంతా  300 మందితో కూడిన  టిఆర్ఎస్ సోషల్ మీడియా టీం కావాలని బాగా  వైరల్ చేసి ట్రోల్ చేసిందని విమర్శించారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు