గిఫ్ట్ ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు


గిఫ్ట్ వచ్చిందని అన్ లైన్ వినియోగదారులను నమ్మించి దోచుకుంటున్న  13మంది సభ్యుల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేసారు.  టాస్క్ ఫోర్స్ ,ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా  శుక్రవారం వీరిని అరెస్టు చేశారు. 

 ముఠా సభ్యుల నుండి 14లక్షల 36వేల రూపాలతో పాటు 15 సెల్ ఫోన్లు, స్క్రాచ్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  ఈ అరెస్టులకు  సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి మీడియాకు  వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇప్పరాజ్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అన్లైన్ ద్వారా గిఫ్టులు వచ్చాయని అమాయక ప్రజలను నమ్మించి డబ్బు దోచుకోవాలని  తాళ్లపల్లి దామోదర్ గౌడ్ తో ప్రణాళిక రూపొందించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పోలీసులకు చిక్కుతామని, నిందితులు ఈ ఆన్లైన్ మోసాలకు కలకత్తా నగరాన్ని  తమ స్థావరంగా ఏర్పాటు చేసుకోని స్థానికంగా వున్న ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్. (ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో వున్నారు) లను తమ అనుచరులగా నియమించుకున్నారు కలకత్తాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ గదినుండి వీరి కార్యకలాపాలను 2014  లో ప్రారంభించారు.

ఇందు కోసం నిందితులు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసిన వారి సెల్ ఫోన్ నంబర్లను సేకరించి  వారికి ఫోన్ చేసి మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినందుకు గాను నిర్వహించిన డ్రాలో కారు బహుమతిగా గెలుచుకున్నారని, మీరు గెలుచుకున్న కారును దక్కించుకోవాలంటే  రొడ్డు టాక్స్ నిమిత్తం కొద్ది మొత్తంలో డబ్బును బ్యాంకులో జమచేయాలని చెప్పే వారు.

 అదే విధంగా నిందితులు  ఆన్లైన్ షాపింగ్ చేసిన వ్యక్తి ఇంటి చిరునామాకు డబ్బులు లేదా కారును గిఫ్ట్ గా గెలుచుకున్నారనే విధంగా స్క్రాచ్ కార్డులను రూపొందించి  వాటిని పోస్ట్ చేసి నమ్మకాలు కలిగించే వారు. గిఫ్ట్ కోసం వివరాలను తెలుసుకోనేందుకు వీలుగా గిఫ్ట్ కార్డులోని ఫోన్ నంబర్లకు సంప్రదిస్తే నిజంగానే డబ్బు లేదా కారును బహుమతిని గెలుచుకున్నట్లుగా నిందితులు సమాధానం ఇవ్వడంతో పాటు వాటిని పొందేందుకు గాను అవసరమయిన పన్నులు చెల్లించేందుకు నిందితులు ఓ నకీలీ బ్యాంక్ ఖాతాను కుడా తెరిచేవారు. 

  ఈ విధంగా ఈ ముఠా సభ్యులు రోజుకి 30 నుండి 40 మందికి ఫోన్ చేసేవారు. ఇందుకోసం ఈ ముఠా సభ్యులు నకీలీ సెల్ ఫోన్ నంబర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడేందుకు కాల్ సెంటర్ ల ద్వారా మోసాలకు పాల్పడుతుండేవారు. 

ఈ విధంగా మోసపోయిన ఆన్లైన్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంతేజార్ గంజ్, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్ గడ్, గీసుగొండ, ఖానాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై  వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అదేశాల మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు పోలీసులు ప్రస్తుతం ఉన్న అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి  నిందితుల కదలికలను గుర్తించి వారు కొలకత్తకు తిరిగి వెళ్ళే క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరించాడు.

 నేరస్తులను అరెస్ట్ చేయంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, మధు,ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ అనాటికల్ అఫీసర్ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుళ్లు శ్యాం సుందర్, సోమయ్య,కానిస్టేబుళ్ళు అలీ, చిరంజీవి, శ్రీకాంత్, సృజన్, శ్రీనివాస్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

నిందితుల వివరాలు 

. ఇప్పరాజ్ కుమార్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా. (ప్రధాన నిందితుడు)  తాళ్లపల్లి దామోదర్ గౌడ్ అలియాస్ దాము బాయ్, అంబేద్కర్ నగర్ బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా,  దాసరి హరీష్ గౌడ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా. మేకల అదిత్య, గుడిపల్లి గ్రామము, మందమర్రి మండలం, మంచిర్యాల్ జిల్లా. ఆకునూరి శ్రవణ్ కుమార్, మంచిర్యాల జిల్లా, .గంగాధర్ రాకేశ్, చాకపల్లి గ్రామము, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా.  పోరండ్ల విజయ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా,  ఈద రవికుమార్, పోన్నారం గ్రామము, మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా,  దార్శ గణేష్, శంషీర్ నగర్, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, సిరికొండ వినోద కుమార్

మందమర్రి, ప్రస్తుతం హన్మకొండ నివాసం, వోల్లల ప్రవీణ్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా, గంగాధరి రాంచందర్, అంబేద్కర్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్ జిల్లా.  ఆడేపు సిద్ధార్డ్, సెంట్ మేరి కాలనీ, రామగిరి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందినవారు వున్నారు. కలకత్తాకు చెందిన  ప్రజీత్,  సంజీవ్,  ప్రకాశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు