ఎక్కువ మందికి వాక్సిన్ ఇవ్వాలి ప్రధాని కి మన్ మోహన్ లేఖ

 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాజి ప్రధాన మంత్రి మన్ మోహన్ సింగ్ దేశంలో కొనసాగుతున్న వాక్సినేషన్ పై కీలక సూచనలు చేస్తు లేఖ రాసారు. కోవిడ్ నియంత్ర‌ణ కోసం వ్యాక్సిన్‌ను సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ఇవ్వ‌ాలని ఎన్ని కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశామ‌ని లెక్క‌లు చెప్ప‌డం కాదని  జ‌నాభాలో ఎంత శాతం మందికి వ్యాక్సినేష‌న్ జరిగింది  అనేది ఎంతో ప్రధాన మైన అంశ మని అన్నారు. వ్యాక్సిన్ల నిల్వ‌ల‌పై కూడా ప‌లు సూచ‌న‌లు చేస్తూ రానున్న 6 నెల‌ల కోసం ఇప్పుడే వ్యాక్సిన్ల‌కు ఆర్డ‌ర్లు ఇవ్వాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర అవ‌స‌రాల కోసం 10 శాతం వ్యాక్సిన్లు మాత్ర‌మే కేంద్రం ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని.. అస‌లు, వ్యాక్సిన్ అవ‌స‌రాలు రాష్ట్రాల‌కే తెలుసు కాబ‌ట్టి.. వాళ్ల‌కు వ్యాక్సిన్లు ఇస్తే.. నిల్వ‌ల‌ను బ‌ట్టి.. రాష్ట్రాలే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని.. వీటితో పాటు వ్యాక్సిన్ల‌ను త‌యారు చేస్తున్న సంస్థ‌ల‌కు నిధులు, రాయితీలు ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని త‌న లేఖ‌లో ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు