ఎన్నికల ప్రచారంలో రాజా బూతులు - వేటేసిన ఎన్నికల సంఘం

 నోటి దురద



ఎన్నికల ప్రచారంలో పరమ బూతులు కూస్తే ఓట్లు పడతాయని రెచ్చి పోతే కుదరదు. ఇష్టం వచ్చిన రీతిలో ప్రత్యర్థి నేతపై  అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డిఎంకె నేత మాజి ఎంపి ఎ. రాజా పై ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు వేటు వేసింది.  రెండు రోజుల పాటు  రాజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన కుండా నిషేదం విధించింది. తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు పళని స్వామిపై అక్రమ సంతానం అని ఎన్నికల సభలో హేలన చేశాడు. అంతే కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడ ఇందులోకి లాగాడు.  ప్రస్తుతం డిఎంకె పార్టీకి స్టార్ కాంపెయినర్ గా ప్రచారం నిర్వహిస్తున్న రాజా  చెపాక్‌లో  జరిగిన ప్రచారంలో  పళని స్వామి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమిళనాడులో కల కలం రేపాయి.  డిఎంకె నేత స్టాలిన్ ను  పొగుడుతు పళని స్వామిని తెగిడాడు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించాడని ఆరోపించాడు.  పళని స్వామి ప్రీమెచ్యూర్ గా జన్మించాడని ఢిల్లీకి చెందిన డాక్టర్‌ నరేంద్ర మోదీ హెల్త్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని కించ పరుస్తూ  మాట్లాడాడు. రాజా చేసిన వ్యాఖ్యలతో పళని స్వామి తీవ్రంగా కలత చెందాడు. తన తల్లిని హేలన చేస్తు రాజా చేసిన వ్యాఖ్యలపై  పళని స్వామి భావోద్వేగానికి లోనై దేవుడు వారికి తగిన శిక్ష వేస్తాడని అన్నారు. రాజా వ్యాఖ్యలకు  అన్నాడిఎంకె వర్గాలు తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లగక్కారు.  రాజాపే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఎన్నికల సంఘం రాజాను వివరణ కోరగా ఆయన వివరణ ఇచ్చారు. అయితే రాజా వివరణ తో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని  అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలను కించ పరిచాడని ఎన్నికల నిభందనలను ఉల్లింఘించి నందుకు శిక్ష విధిస్తున్నామని పేర్కొంది.

ఎన్నికల ప్రచార సభల్లో మాస్ చప్పట్లకు, ఈలలకు రెచ్చి పోయిన నేతలు వారి మెప్పు కోరుతూ పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం అంతటా పరిపాటిగా మారింది. ఇలాంటి వాటితో  ఎన్నికల ప్రచార సభలు బాగా కలుషితం అయి పోతున్నాయి. ఎన్నికల సంఘం  రాజాపై తీసుకున్న చర్యను అందరు అభినందిస్తున్నారు.

ఎన్నాడిఎంకె కూటమిలో భారతీయ జనతా పార్టి ఉండగా డిఎంకె కూటమిలో కాంగ్రేస్ పార్టి ఎన్నికల బరిలో  ఉంది. తమిళ నాడులో హోరా హోర ిఎ్ననికల ప్రచారం జరుగుతోంది. 

బెంగాల్ లో సువేందు ఏమన్నాడంటే

మాజీ టీఎంసీ నేత అయిన సువేందు సీఎం మ‌మ‌తా  66 ఏళ్ల ఆంటీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఇటీవల మమతా విమర్శల నేపథ్యంలో సువేందు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తు ఒక ముఖ్యమంత్రిగా ఆమె త‌న నోటిని అదుపులో పెట్టుకోవాల‌ని, ప్రధాని మోదీపై ఆమె అభ్యంత‌ర‌క‌ర రీతిలో భాష‌ను వాడుతున్నార‌ని ఆరోపించారు.ఈ సందర‍్బంగా  బెంగాల్ సీఎంను 66 ఏళ్ల ఆంటీ అంటూ ఆయన సంబోధించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు