వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదు - బిజెపి చీఫ్ బండి సంజయ్


 వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఒంటరిగా పోటి చేస్తుందని ఆ పార్టి చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేసారు. 

పార్టి కార్యాలయంలో గురువారం  జరిగినయువ మోర్చా రాష్ట్ర  కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.  టిఆర్ ఎస్ తో పొత్తు ఉంటుందని తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నా రంటూ బండి సంజయ్ విమర్శించారు. 

2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. "గోల్కొండ కోటను చూస్తే దాని మీద కాషాయ జెండానే మనకు కనిపించాలి. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లు.. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరి దోచుకుంటుంది. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన సాగుతోంది. అవినీతి, రజాకార్ పాలన కొనసాగుతోంది. రాక్షస పాలన నుంచి విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలి" అని బండి సంజయ్ అన్నారు.

ఎందరో కార్యకర్తల ప్రాణ త్యాగాల వల్లే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని  వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. పోలీసులకు, అరెస్టులకు భయపడే కార్యకర్తలు బీజేపీకి అవసరం లేదని ఆయన అన్నారు.  టిఆర్ఎస్ సర్కార్ పై విరుచుకు పడుతూ ఎన్నికలు వస్తేనే ప్రభుత్వానికి ఉద్యోగాలు గుర్తు వస్తాయని నోటిఫికేషన్లు జారి చేస్తుందని కేంద్రానికి లేఖలు రాస్తుందని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం కార్పోరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఎమెల్సి ఎన్నికల్లో మేధావి  వర్ంగ తీసుకున్న నిర్ణయం చూసి భాద కలిగించిందని అన్నారు. టిఆర్ఎస్ పైసలు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిందని ఎలా గెలిచరో అందరికి తెల్సునని అందుకే విజయోత్సవాలు ఎక్కడా జరుపు కోలేదని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ అరాచక పాలన మోదలైందని అన్నారు. భైంసాలో అల్లర్ల వెనక హిందూ  వాహిని కార్యకర్తలున్నారని ఓ పోలీస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పితే ప్రజలు నవ్వుకున్నారని  అన్నారు.  సంఘ విద్రోహ శక్తులకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. కరోనా నయంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలను కాపాడాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు