అలుపెరుగని జర్నలిస్టుకు ఆశ్రునివాళులు


 సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం బుధవారం తెల్లవారు జామున (28-04-2021) గచ్చి బౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో  కరోనాకు చికిత్స పొందుతూ కాలధర్మం చేశాడు. జర్నలిస్టు యూనియన్ వాట్సాఫ్ గ్రూపులో ధర్మాసనం శ్రీధర్ ఇక లేరనే వార్త చూసి చాలా భాదేసింది. జనం వార్తలు రాసే జర్నలిస్టులు  కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో  మరణ వార్తల్లో కల్సి పోతుండడం జర్నలిస్టు సమాజానికి అత్యంత  దుఖ్ఖితం.

మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శ్రీధర్ కు మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కాని ఆయన కరోనా మృత్యువును జయించ లేక పోయారు. 

శ్రీధర్ ధర్మాసనం చాలా కాలం పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ఆ తర్వాత డిజిల్ మీడియా ప్లాట్ ఫాం కు వచ్చారు. మాహైదరాబాద్ డాట్ఇన్ ఆన్ లైన్ మీడియా  వ్యవస్థాపకులు. 

శ్రీధర్ ను  నాకు ఎం.వి.రమణ (టిజెఎఫ్) పరిచయం చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడక్కడా కలిసాం.  చారిత్రక హైదరాబాద్ విశిష్టతను తెలియ చేస్తు మా హైదరాబాద్  పేరిట పుస్తకం ప్రచురించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం టియుడబ్ల్యు జే కు అనుభందంగా ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి దానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను కల్సి ప్రయత్నాలు చేసారు. తెలంగాణ లో పలు జిల్లాలలో ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులతో సంప్రదింపులు జరిపి అసోసియేషన్ బలోపేతానికి చాలా కృషి చేసారు.  

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రైతులు కొనసాగిస్తున్న సుదీర్ఘ కాల ఉద్యమంపై శ్రీధర్ ఓ డాక్యుమెంటరి తీసారు. రైతుల సమస్యలు రాజకీయ కోణంలో కాకుండా రైతుల కోణంలో చూడాలని రైతులు కొనసాగిస్తున్న  పోరాటం పూర్తిగా ప్రజాస్వామిక మైందని డాక్యు మెంటరీలో వివరించారు.

శ్రీధర్ ధర్మాసనం మరణం జర్నలిస్టు లందరిని కలిచి వేసింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో 15 మంది వరకు కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయారు. కొందరు జర్నలిస్టులు కరోనా సోకి ఇండ్లళ్లో హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స లో ఉండగా మరి కొందరు  ఆసుపత్రుల్లో చేరి చికిత్సలో ఉన్నారు. 

మహేందర్ కూన

జర్నలిస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు