లైవ్ లో పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నం చేసిన కెయు స్టూడెంట్

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగి మనస్తాపం 

వరంగల్ లో విషాదం
వరంగల్ లో విద్యార్థుల ఆగ్రహం 


నోటిఫికేషన్లు రావడం లేదని జాబు రాలేదని కాకతీయ యీనివర్శిటి విద్యార్థి లైవ్ లో పురుగులు మందు సేవించి ఆత్మహత్యం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ  గ్రామానికి చెందిన తేజావత్ బోడ సునీల్ అనే విద్యార్థి యూని వర్శిటి గ్రౌండ్ లో శుక్రవారం ఉదయం  లైవ్ లో పురుగులు మందు సేవించాడు.  

"నా పేరు బోడ సునీల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయితుంది ఎలాంటి నోటిఫికేషన్ లేదు ఇలాంటి జాబులు లేవు నేను చాతకాక చనిపోవడం లేదు ఈ రాష్ట్రంలో అందరికీ జాబు లో రావాలంటే నేను చావడమే కరెక్టు  డిసీషన్అ అని మెడిసిన్ (పాయిజన్) తీసుకున్నాను " అంటూ పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నం చేయగా అతన్ని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తన చావుకు సిఎం కెసిఆరే కారణమన్నాడు.  మీరు కెసిఆర్ ను వదిలి పెట్ట వద్దని తాను బతికితే మీతో కల్సి పోరాట చేస్తానంటూ సునీల్ వీడియోలో అన్నారు. తాను ఐఏఎస్ కావల్సిన వాన్నని ఎస్ ఐ పోస్టు కు పరీక్ష రాసి అర్హత పొందానని అయితే హైట్ లేదని ఉద్యోగం రాలేదని కానిస్టేబుల్ ఉద్యోగం కూడ రాలేదని సునీల్ పురుగుల మందు తాగిన అనంతరం మీడియా వారితో మాట్లాడు  ఆవేదన చెందాడు.

సునీల్ ఆత్మహత్యా యత్నం వరంగల్ లో కల కలం రేపింది. విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేసారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచడం వల్ల ఇక  ఉద్యోగాలు రావని  నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది ప్రభుత్వాని కిసిగ్గు చేటని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సునీల్ చికిత్స పొందుతున్న ఎంజిఎం ఆసుపత్రి ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు