నిరుద్యోగ భృతి ఇస్తాం- ఆర్టీసి కార్మికుల వేతనాలు పెంచుతాం-సిఎం కెసిఆర్

 నిరుద్యోగులకు తప్పకుండా నిరుద్యోగ భృతి ఇచ్చి తీరుతాం
ఆర్టీసి కార్మికులకు కూడ వేతనాలు పెంచుతాం
                                                                              అసెంబ్లీలో ప్రకటించిన సిఎం. కెసిఆర్


నిరుద్యోగ భృతి, ఆర్టీసి కార్మికుల వేతనాలపై సిఎం కెసిఆర్ శుక్రవార అసెంబ్లీలో  ప్రకటన చేసారు.  నిరుద్యోగులకు తప్పకుండా నిరుద్యోగ భృతి ఇచ్చి తీరుతామని ప్రకటించారు.   కరోనా కారణంగా నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయామని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపడతామని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఏవిదంగా నిరుద్యోగ భృతి ఇస్తున్నారో పరిశీలిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నది తమ సంకల్పమని కరోనా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి కల్పిస్తామని అట్లాగే విద్యా రంగ నిధులు పెంచే ప్రయత్నం చేస్తామని సిఎం వివరించారు.

తెలంగాణ కోసం ఆర్టీసి కార్మికుల పోరాటం మరువ లేం

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచినట్లే ఆర్టీసి కార్మికులకు కూడ వేతనాలు పెంచుతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు." తెలంగాణ ఉద్య‌మంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయి.. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మ‌ర‌వ‌ లేనిది.. ఆర్టీసీ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదు... ఆర్టీసీని కాపాడుతున్నాం. బ‌డ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించాం.... ప్ర‌తి నెల నిధులు విడుద‌ల చేస్తున్నాం" అని కెసిఆర్ పేర్కొన్నారు. ఆర్టీసి ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణ శాఖ మంత్రితో చ్రించి జ్వరలోనే వేతనాల పెంచే విషయంలోనిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు