ముంబై లో ఘోరం - అగ్నిప్రమాదంలో కరోనా పేషెంట్ల సజీవ దహనం

 


కరోనా మహమ్మారి వైరస్‌ భారిన పడిన  బాధితులు చికిత్స పొందుతున్న ముంబై లోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన  అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 10 కి చేరింది.   ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాండూప్‌ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మహా రాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దవ్‌ థాకరే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

నన్ను ‘క్షమించండి’ అంటూ బాధిత కుటుంబ సభ్యులకు  సీఎం థాకరే  క్షమాపణలు వేడుకున్నారు.  అగ్ని ప్రమాదం సంఘడటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై ఖఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతులలో ఎక్కువగా వెంటలేటర్లపై చికిత్స పొందుతున్న వారే మరణించారని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఆస్పత్రి భవనాన్ని సందర్శించి  ప్రమాదానికి గల కారణాలను  అడిగి తెల్సుకున్నారు.

 సన్‌ రైజ్‌ ఆస్పత్రిలో మొత్తం 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.  మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో సిబ్బందితో పాటు మిగతా పేషెంట్లు బయటికి పరుగులు తీసారు. అయితే  వెంటిలేటర లపై చికిత్స పొందుతున్న వారు  బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో వారంతా అగ్నికీలల్లో చిక్కుకుపోయి హాహా కారాలు చేస్తు దగ్దం అయ్యారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని  పోలీసులు తెలిపారు.  గతంలో రక్షణ చర్యలు లేవని ఈ ఆస్పత్రికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులుజారి చేసింది. అయినా కూడా ఆస్పత్రి యాజమాన్యం,  భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు  తెలిపారు.

 ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు