మణ్యం దొర అల్లూరి ఫస్ట్ లుక్ అదిరిందయ్యా రాజమౌళి

 రాంచరణ్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందే రాజమౌళి గిఫ్ట్


రాం చరణ్ బర్త్ డే కు ఒక రోజు ముందే  టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి బర్త్ డే గిఫ్టు ఇచ్చాడు.  రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27 కాగా రాజమౌళి దాన్ని దృష్టిలో పెట్టుకుని  ఆర్ ఆర్ ఆర్ మూవీ లో రాం చరణ్ పాత్ర అయిన అల్లూరి సీతారామా రాజు ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం విడుదల చేశారు.  ట్విట్టర్ లో విడుదల చేసిన  రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు పోస్టర్ బాగా వైరల్ అయింది. కండలు తిరిగిన చేతులతో ఎక్కు పెట్టి పట్టుకున్న  విల్లుతో బాణం వదిలేందుకు సిద్దపడ్డ రాం చరణ్ పోస్టర్ అదిరి పోయిందని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్రిపుల్ ఆర్ లో రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు  పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

ధగ, ధగ మండుతున్న బాక్ గ్రౌండ్ నేపద్యంలో బాణం ఎక్కు పెట్టిన మణ్యం వీరుడు రాం చరణ్ ఫోటో అందుకు తగినట్లుగా ఆయన తీక్షణ చూపులు వెనక్కి గాలిలో లేస్తున్న కురులు చూసి అదిరి పోయిందని అభిమానులు సంబర పడి పోయారు.



రాజమౌళి కూడ  స్పందించారు. ధైర్యం, ఆత్మగౌరవం, పరిపూర్ణత కలిగిన వ్యక్తి.... ఇడుగో.. ఇతడే నా అల్లూరి సీతారామరాజు  అంటూ రాజమౌళి  వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ  పోస్టు చేసిన కొద్దిసే పట్లోనే వేల సంఖ్యలో ట్వీట్లు, రీ ట్వీట్లు  లైకులతో అభిమానులు బాగా వైరల్  చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు