సునీల్ ను పరామర్శించిన తీన్మార్ మల్లన్న - కెసిఆర్ పై తీవ్ర విమర్శలు

 ఆత్మహత్య యత్నం చేసిన నిరుద్యోగి బొడ సునీల్ ను పరామర్శించిన తీన్మార్ మల్లన్న
ముఖ్యమంత్రి కెసిఆర్ ను హన్మకొండ చౌరస్తాలో ఉరి తీసినా తప్పు లేదన్న తీన్మార్ మల్లన్న



రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు.  తెలంగాణ నిరుద్యోగులు భరోసా కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని  ఆత్మహత్యలన్ని  ముఖ్యమంత్రి కెసిఆఆర్ ప్రేరేపిత ఆత్మహత్యలే నని అన్నారు.కెసిఆర్ ను హన్మకొండ చౌరస్తాలో ఉరి తీసినా తక్కువేనని తీన్మార్ మల్లన్న విమర్శించాడు.

 ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని కాకతీయ యూనివర్శిటి గ్రౌండ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోడ సునీల్ ను తీన్మార్ మల్లన్న  ఆయన టీం సబ్యులు కల్సి శనివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతు ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆయన పరిపాలనా తీరును దుయ్య బట్టారు. తెలంగాణ రాక ముందు నీళ్లు, నిధులు, నియామకాలంటూ  అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి నంక నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు భర్తి కాక  నిరుద్యోగులు భరోసా కోల్పోయేలా చేశాడని ఆరోపించారు. బిడ్డకు పదవి లేక పోతే నిజామాబాద్ లో ఎమ్మెల్సి పదవి ఖాళి కాంగనే పదవి ఇచ్చాడని అన్నారు. తెలంగాణ ద్రోహులకు పదవులిచ్చి  మొత్తం తెలంగాణ నిరుద్యోగులకు పదవు లిచ్చానని చెబుతున్నాడని విమర్శించారు. వారం పది రోజుల పాటు జరిగిన అసెంబ్లి  సమావేశాలలో ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన హామి ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల భర్తి విషయంలో తక్షణమే ఓ హామి పత్రాన్ని ప్రజల ముందు పెట్టాలని నోటిఫికేషన్లపై భరోస ఇవ్వని పక్షంలో ఆత్మహత్యల పరంపర ఆగదని  ఆందోళన వ్యక్తం చేశారు.  కెసిఆర్ ప్రభుత్వం కూలి పోతే తప్ప ఉద్యోగాలు రావని అన్నారు.  కెసిఆర్ ప్రభుత్వం కూలి పోవడం మంచిరోజులు రావడం ఖాయమని  నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేశారు.

ఆత్మహత్య  యత్నం చేసిన బోడ సునీల్ ను ప్రభుత్వం తక్షణం ఆదు కోవాలని ఆయన కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని డిమాండ్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు