ఆదిలాబాద్ జిల్లాలో ఊరవతల గుడిసెలో కరోనా సోకిన బాలిక

పెరుగుతున్న కరోన కేసులు 

 


కరోనా కేసులు తెలంగాణ లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరో వైపు కేసులు పెరుగుతున్నా సామాజిక దూరం పాటించకుండా  నిర్భయంగా తిరుగుతున్నారు. మొన్నటి  వరకు విద్యా సంస్థలు పని చేయడంతో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోన భారిన పడ్డారు. 

గ్రామాలలో కూడ కరోనా వ్యాప్తి పెరగడంతో గ్రామస్థులు అసంబద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా సోకితే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచి వైద్య చికిత్స అందించాల్సిన  పేషెంట్లకు అనవసరమైన కట్టుబాట్లు విధిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఫతేపూర్ గ్రామ పంచాయితీ పరిధి లోని సాలెగూడ గిరిజన గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక కరోనా భారిన పడగా ఊరవతల గుడిసెలో ఉంచారు. గ్రామంలో ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని  ఊరవతల గుడిసె వేసి ఈ అందులో ఓ "గడంచ"  వేసి ఉంచారు.  సమయానికి భోజనం సమకూరుస్తూ ఇతర సహాయం అంద చేస్తున్నారు. అయితే కరోనా కోసం మరి  ఇంతగా కట్టు బాట్లు విధించాల్సిన అవసరం లేదన్న విమర్శలు వచ్చాయి. 

పాఠశాలలు మూసి వేయడంతో విద్యార్థులు  తిరిగి ిండ్లకు చేరు కోవడం వల్ల వారి కుటుంబ సబ్యులకు గ్రామస్థులకు కరోనా వ్యాపిస్తున్నట్లు చాలా గ్రామాలలో గుర్తించారు. కరోనా పరీక్షలు జరిగితే కాని పాజిటివ్ కేసులు నిర్దారణ కావడం లేదు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 4,495 ఆక్టివ్ కేసులు నమోదయ్యాయి. హోం ఐసోలేషన్ లో ఉండి 1,979 మంది చికిత్స పొందుతున్నారు.  క్రితం రోజు 278 (27-03-2021) కేసులు నమోదు కాగా ముగ్గురు చని పోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,688 కి చేరింది.  శనివారం ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా 57,942 కరోనా పరీక్షలు నిర్వహించారు.

యాదాద్రి లో కరోనా కలకలం  36 మందికి పాజిటివ్

యాదాద్రి నర్సింహస్వామి ఆలయంలో 36 మందికి కరోనా పాజిటివ్​ గా నిర్దారణ అయింది. వీరిలో 14 మంది ఆలయ పూజారులు, 17 మంది సిబ్బంద తో సహా బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఐదుగురు రుత్వికులు ఉన్నారు. ఆలయంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టు ఈవో గీతారెడ్డి వెల్లడించారు.
ఈ మూడు రోజులు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఆలయంలో ఈ నెల 15 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా కొండకింద నిర్వహించిన స్వామి వారి కల్యాణానికి హైదరాబాద్​ సహా చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

కరోనా నియంత్రణకు మరో సారి లాక్ డౌన్ విదించ బోమని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రభుత్వం తాజాగా కొన్ని పాక్షిక అంక్షలు విధిచింది. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, ప్రార్ధనా మందిరాల్లో ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించ రాదు.ర్యాలీలు, సభలు, సమావేశాలకు ఈ నెల 30 వరకు అనుమతులు లేవు. వాహనాల్లో తిరిగే వారు, మార్కెట్లలోసంచరించే వారు విధిగా మూతికి మాస్కులు ధరించాలి. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఈ నిభదనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు