వరంగల్ కు ఎయిర్ పోర్టు రాకుండా అడ్డుకున్నదే కెసిఆర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి

 


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని తెలంగాణ ప్రజలు భావించారని కాని అందుకు భిన్నంగా  అభివృద్ధి కుంటు పడి పోయిందని కాంగ్రేస్ పార్టి నేత ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికార పార్టీయే అభివృద్ధి పనులకు అడ్డు తగులుతోందని దుయ్య బట్టారు. 

ఎమ్మెల్సి ఎన్నికల్లో పార్టి అభ్యర్థి రాములు నాయక్  గెలుపు కోసం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగ వరంగల్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ కు ఎయిర్ పోర్టు రాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆరే అడ్డు తగిలారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ అడగదు... కేంద్రంలో బీజేపీ ఇవ్వదు అంటూ దుయ్యబట్టారు. టిఆర్ఎస్ పార్టి, బీజెపి రెండు తోడు దొంగలని అన్నారు. కాజిపేట కోచ్ ప్యాక్టరి కోసం పోరాడైందుకు కాంగ్రేస్ పార్టి సిద్దంగా ఉందని ఎప్పటికైనా సాధించి తీరుతామని అన్నారు.

ప్రైవేటీకరణ కారణంగానే కోచ్ ఫ్్యాక్టరీని పక్కన పెట్టారని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రుభుత్వం కమీషన్లు వచ్చే పనులుత్వరగా చేస్తుందని కోచ్ ఫ్యాక్టరీకి కమీషన్ రాదు కనుక ఏర్పాటు చేయలేదన్నారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో పోటి చేస్తున్న  టిఆర్ ఎస్ పార్టి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అయన స్వంత యూనివర్శిటీ పై ఉండే శ్రద్ద ప్రభుత్వ యూనివర్శిటీలపై లేదని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు