అధికారం లోకివస్తే లీటరు 60 కే పెట్రోల్, డీజిల్


రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల తో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో కేరళలో బారతీయ జనతా పార్టి సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్  ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎన్నికలు జరుగ బోతున్న కేరళలో ఎప్పటి నుంచో పాగ వేయాలని బిజెపి ఎదురు చూస్తోంది. ఎల్ డిఎఫ్ ను గద్దె దించి బిజెపి అధికారం లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు బిజెపి ఓ ఆలోచన చేసింది. తమ పార్టి కేరళలో అధికారం లోకి వస్తే పెట్రోల్, డీజిల్ 60 రూపాయలకే లీటరు చొప్పున  అందిస్తామని ప్రకటించింది. 

బిజెపి నేత నేత కుమ్మనం రాజశేఖరన్ ఈ మేరకు మీడియా సమావేశంలో హామి ఇచ్చారు. బీజెపి అధికారం లోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకు వస్తామని దాంతో ధరలు బాగా తగ్గి లీటరు 60 కు లభిస్తాయని తెలిపారు. ఎలి డిఎఫ్ డీజిల్, పెట్రోల్ ధరలను ఎందుకు జిఎస్టి పరిధి లోకి తీసుకు రావడంలేదని ప్రశ్నించారు.

కేరళలో భాజపా అధికారం లోకి వస్తే తప్ప పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. కేంద్రంలో కూడ అధికారం వారిదే ఇక ధరలు తగ్గించేందుకు అడ్డేమిటని ప్రశ్నిస్తున్నారు. భాజపా ఎన్నికల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎన్ని ఎత్తులు   వేసి జిత్తుల మారి వేశాలు వేసినా కేరళలో అధికారం లోకి రాలేరని ఎల్ డిఎఫ్ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో తేల్చి చెబుతున్నారు.

సిఎం అభ్యర్థిగా మెట్రో శీధరన్

బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు. మరోవైపు గురువారంతో తాను పదవీ విరమణ చేస్తానని, ఆ తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘ఈ వేషధారణలో ఉండడం ఇదే చివరి రోజు. ఇది ఢిల్లీ మెట్రో రైల్ యూనిఫాం. ఇదో విలక్షణమైన యూనిఫాం.’’ అని శ్రీధరన్ తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు