జర్నలిస్టుల సంక్షేమానికి రూ.52 కోట్లు ఇచ్చిన సి.ఎం కేసీఆర్ కు కృతజ్ఞలు: టియుడబ్య్లూజె


 

జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న 17.5 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించి 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమ చేయించినందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నేతలు  కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, తెంజు అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టియుడబ్య్లూజె హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగానంద్, యార నవీన్ కుమార్ తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే 34.5  కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి  తెలంగాణ ప్రభుత్వం అంద జేసిందని మరో 17.5 కోట్ల రూపాయలను  మార్చి 4న  విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ నిధితో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నోకార్యక్రమాలు  చేపట్టాలని ఆకాంక్షిస్తూ, నిధి పెరుగుదలకు కృషి చేసిన అల్లం నారాయణకి, నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్ కి, ఇంత వేగంగా రావడానికి సహకరించిన జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు జర్నలిస్టుల హితం కోరే వారని  అని మరో సారి చాటుకున్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.52 కోట్ల నిధిని సమకూర్చినందుకు సి.ఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు