సాగర మథనం లో సంకుల సమరం

రెడ్డి, బి.సి, ఎస్టి సామాజిక వర్గాల అభ్యర్థుల మద్య ప్రధాన పోటి
జనర్ సీటులో ఎస్టి  అభ్యర్థిని నిలిపిన బిజెపి
బి.సి ఓట్లతో గట్టెక్కాలని వ్యూహం పన్నిన టిఆర్ఎస్ 


ఉప ఎన్నికలు జరుగ బోతున్న నాగార్జున సాగర్  అసెంబ్లి నియోజక వర్గంలో ఆసక్తి కరమైన  పోటి నెల కొంది. గతంలో ఎన్నడూ లేని విదంగా  ఉప ఎన్నికల్లో కులాల మద్య పోటి జరుగ బోతోంది.  పోటి పడుతున్న టిఆర్ఎస్, కాంగ్రేస్, బిజెపి  ప్రధాన పార్టీల సామాజిక నేపధ్యాలు భిన్నంగా ఉన్నాయి.  అభ్యర్థుల కుల సమీకరణాల మేరకే టికెట్లు కేటాయింపు  జరిగిందనేది వాస్తవం. కాంగ్రేస్ పార్టి అభ్యర్థి  పాత కాపు జానారెడ్డి రెడ్డి సామాజిక నేపద్యం కలిగి ఉండడంతో అధికార టిఆర్ఎస్ పార్టి బి.సి సామాజిక వర్గానికి చెందిన యాదవ అభ్యర్థి నోముల భగత్ ను ఖరారు చేసింది.  భగత్ ను నిల బెట్టడంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఆశించింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నోముల నర్సింహయ్య కుమారుడిగా సానుభూతి ఓట్లతో పాటు బి.సి సామాజిక వర్గం ఓట్లు కూడ కల్సి వస్తాయనే అంచనాతో  భగత్ ను ఎంపిక చేశారు. టిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల అభ్యర్థుల ఎంపిక జరిగే వరకు వేచి ఉండి భారతీయ జనతా పార్టి ఎస్టి సామాజిక వర్గం అభ్యర్థి అయిన  డాక్టర్ రవి కుమార్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బి.సి ఓట్ల తర్వాత ఎస్టి ఓట్లే అధికంగా ఉ్ననాయి.  దీన్ని బట్టి చూస్తే ఉప ఎన్నికల్లో  సాగర్ లో రెడ్డి, బి.సి, ఎస్టి సామాజిక కులాల మద్య పోటి అనివార్యంగా మారింది. బిజెపి అభ్యర్థి డాక్టర్ రవి కుమార్ వైద్యుడిగా మంచి పేరుంది. జనరల్ సీటులో ఎస్టి అభ్యర్థిని నిలిపామన్న క్రెడిట్ దక్కించు  కోవడం కోసం బిజెపి డాక్టర్ రవి కుమార్ ను పోటీలో దింపి ఉండవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.

సాగర్ నియోజక వర్గంలో యాదవ, కుర్మ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. వీరికి తోడుగా ఇతర బి.సి కులాల ఓట్లు కూడ సంఖ్యాపరంగా భారీగానే ఉన్నాయి.  గతంలో కమ్యునిస్టు పార్టిలో కొనసాగి  టిఆర్ఎస్ పార్టీలో చేరిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఓడి పోయినా 2018 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి అభ్యర్థి జానారెడ్డి పై కుల బలగం ఓట్లతోనే గెలవ గలిగారు. నోముల అకాల మరణంతో సాగర్ లో ఉప ఎన్నికలు జరుగ బోతున్నాయి.

ప్రధాన పోటి టిఆర్ఎస్ కాంగ్రేస్ పార్టీల మద్యే ఉండబోతున్నా బిజెపి సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో సత్తా చాటుకోవాలనే గట్టి పట్టుదలతో  అడుగులు వేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్, బిజెపి మద్య  పోటా పోటీ జరిగి ఫలితాలు తీవ్ర ఉత్కంఠ కలిగించాయి. ఆఖరికి  బిజెపి అభ్యర్థి రఘునందన రావు విజయం సాదించారు. సాగర్ లో 2018 ఎన్నికల్లో పోటి చేసిన  బిజెపి అభ్యర్థికి డిపాజిట్ కూడ దక్కలేదు. దుబ్బాక ఉప ఎన్నికల నాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. దుబ్బాక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత బాగా ఉండింది. వ్యతిరేకత తీవ్రతలన్నింటిని అధికార టిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్సి ఎన్నికల సమయంలో నే  చాలా వరకు తగ్గించు కోగలి గింది. 

కాంగ్రేస్ పార్టి అభ్యర్థి జానారెడ్డి గెలుపు పై ఎంతగా ధీమాతో ఉన్నా ప్రస్తుతం కులాల సమీకరణలు చూస్తే  పరిస్థితులు ఎలా ఉండ బోతున్నాయో ననే ఆసక్తి నెల కొంది. 2018 ఎన్నికల్లో కూడ జానారెడ్డి నియోజక వర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులపై పూర్తి ధీమా కనబరిచారు. కాని నోముల నర్సింహయ్య గతంలో ఓడి పోయిన సానుభూతి పనిచేసింది. ఇప్పుడు నోముల నర్సింహయ్య తనయుడిగా భగత్ కు సానుభూతి కల్సి వచ్చే అవకాశం ఉంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు