ఆంధ్ర జ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన బిజెపి ఎంపి సుబ్రమణ్య స్వామి


భారతీయ జనతా పార్టి ఎంపి, ప్రముఖ  న్యాయ వాది సుబ్రమణ్య స్వామి ఆంధ్ర జ్యోతి దినపత్రికపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు పరువు నష్టం దావా వేసివనట్లు సుబ్రమణ్య స్వామి మీడియాకు తెలిపారు.  బుధవారం తిరుపతి సివిల్ కోర్టులో వేసిన దావాపై స్వయంగా సంతకం పెట్టేందుకు వచ్చిన సుబ్రమణ్య స్వామి మీడియాతో మాట్లాడారు.

2019 లో ఆంధ్రజ్యోతి ఓ తప్పుడు కథనం ప్రచురించింది. టిటిడి వెబ్ సైట్లో క్రిస్టియన్స్ కు సంభందించిన మత ప్రచారం జరుగు తోందంటూ వార్త వార్త ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వార్తపై అప్పట్లో 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తప్పుడు కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హందువులు మనోభావాలు దెబ్బ తీసారని ఆరోపిస్తు టిటిడి కోర్టులో కేసు వేసింది. పరువు నష్టం దావాల్లో సక్సెస్ అయిన ఎంపి సుబ్రమణ్య స్వామి ఇదే కేసులో 100కోట్లకు ఆంధ్ర జ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేశారు.

హిందు ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని సుబ్రమణ్య స్వామి పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఆయన కేంద్రంలో బిజెపి ప్రభుత్వంలో ఎంపిగా  కొనసాగుతున్నప్పటికి పలు  అంశాలలో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఆధీనంలో ఉండడ మేమిటని ప్రశ్నించారు. మజీదులు, చర్చిలు ప్రభుత్వ ఆధీనంలో లేనపుడు కేవలం హిందు ఆలయాల పైనే ప్రభుత్వం పెత్తనం చేస్తున్నదని  ఆయన అభ్యంతరాలు లేవ నెత్తారు.

 తితిదేను భక్తులే నడిపించేలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలన్నారు. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్న సీఎం జగన్‌ నిర్ణయం బాగుందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. 

పరువు నష్టం కేసుకు సంభందించి సుబ్రమణ్య స్వామి మీడియాతో మాట్లా డుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి తమ కుటుంబ ఇష్టదైవమని తన తల్లి క్రమం తప్పుకుండా తిరుపతికి వచ్చేవారని టిటిడి పై దుష్ర్పచారాలు జరుగుతుండటం ఆపాలనే ఉద్దేశంతో పరువు నష్టం కేసు వేశానని తెలిపారు.

చంద్రబాబు కాపాడుతారనుకుంటున్నారేమో.. అలాంటి ఆశలేవీ పెట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు కూడా.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీపై ఆంధ్రజ్యోతి వెర్షన్ ఒకరకంగా ఉండేదని, బాబు ఓడిపోయిన తర్వాత టీటీడీ పాలకమండలి మారిన తర్వాత బురదజల్లడం మొదలు పెట్టిందని చెప్పారు స్వామి. కుల మతాల మధ్య చిచ్చుపెట్టేలా కథనాలు వండి వార్చారని కూడా విమర్శించారు.

కుట్రపూరితంగానే జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన జీవితంలో తానెప్పుడూ పరువునష్టం దావా కేసు ఓడిపోలేదని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి.. ఈ కేసు కూడా గెలవబోతున్నామని, ఆంధ్రజ్యోతితో 100కోట్లు కక్కిస్తానని ఛాలెంజ్ చేశారు. 

జగన్ ను కల్సిన స్వామి

అనంతరం సుబ్రమణ్య స్వామి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. టీటీడీ లావాదేవీలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు