ఆ ఒక్క మాటతో కెటిఆర్ అక్కడ హీరో అయిండు

 


ఆంధ్ర ప్రాంత ప్రజలకు విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు తెలంగాణ మంత్రి కెటిఆర్ ఇప్పుడో హీరో అయ్యాడు.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు  ఆయన చెప్పిన  మాట ఆంధ్రలో  హీరోను చేసింది. శివరాత్రి రోజు  శివుడికి పాలాభి షేకం చేస్తారు కాని పోరాటంతో ప్రతి రోజు తిండి తిప్పలు మాని నిద్రలు లేని రాత్రులతో నిత్యం శివ రాత్రిగా గడుపుతున్న కార్మికులు కెటిఆర్ చిత్ర పటానికి  పాలాభి షేకం చేసారు.  ఈ రోజు శివరాత్రి అన్న సంగతి కూడ వారికి తెలుసో లేదో తెలియదు. కార్మికుల తపనంతా ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కోవాలనే. దుఖ్కంలో ఉన్న  కార్మికులకు తెలంగాణ మంత్రి కెటిఆర్ మద్దతు ప్రకటించడం ఎంతో స్పూర్తిని కలిగించింది.  అందుకే ఆయనకు కృతజ్ఞతలు చాటుతూ పాలాభి షేకం చేసారు.

విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల పోరాటాన్ని మంత్రి కెటిఆర్ సమయస్పూర్తిగా వినియోగించుకున్నారు. ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తురణంలో కెటిఆర్ ప్రకటన తమ పార్టి అభ్యర్థులకు తోడ్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు కాంగ్రేస్, బిజెపి పార్టీలను తన ప్రకటనతో ఇరుకున పడేలా చేసారు. ప్రధానంగా ఎమ్మెల్సి ఎన్నికల్లో గట్టి పోటి ఇస్తున్న బిజెపి కి కెటిఆర్ చేసిన ప్రకటన రుచించడం లేదు. మరో వైపు కాంగ్రేస్ పార్టి కూడ విమర్శలు చేసింది. ఎంపి రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. బిజెపి విషయంలో టిఆర్ఎస్ గల్లీకి, ఢిల్లీకి పొంతన లేకుండా వ్యవహరిస్తోందని  విమర్శించారు. విభజన చట్టంలో తెలంగాణ కు రావాల్సిన వాటి కోసం పోరాడాలని అన్నారు. పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపీలు సమస్యలపై  పోరాడకుండా ఎందుకు ముఖం చాటేసారని ప్రశ్నించారు.

విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మంత్రి కెటిఆర్ చేసిన మద్దతు ప్రకటన ఆంధ్రలో పరపతి పెంచింది. ఎమ్మెల్సి ఎన్నికల అనంతరం కెటిఆర్ విశాఖకు వెళ్లి కార్మికుల పోరాటంలో ప్త్యక్షంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పార్టి వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు