వేగం పెరిగిన కొద్ది కలిగే దృష్టి లోపాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల శాస్త్రీయ ప్రచారం

వేగంతో కూడిన డ్రైవింగ్ మీ దృష్టిని ఏమార్చుతుంది

ట్విట్టర్ వేదికగా ఇమేజ్ లతో ప్రచారం 


వాహనాన్ని మితి మీరిన వేగంతో నడిపితే ఏం జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూతన రీతిలో  శాస్త్రీయ పద్దతిలో అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఒకటైన ట్విట్టర్ ద్వారా ఈ ప్రచారం చేపట్టారు. అతి వేగం అన్ని విధాలా అనర్ద దాయకమని ఎడ్యుకేట్ చేస్తున్నారు.  వాహన వేగం కారణంగ మన దృష్టి లో కలిగే పరిణామాలు తమ ప్రచారంలో వివరించి చెబుతున్నారు. వాహనం నడిపే సమయంలో  మన కండ్ల దృష్టి అనేది చాలా  ప్రధానం. మన దృష్టి లో ఏ మాత్రం లోపం ఉన్నా ప్రమాదాలు తప్పవు. వాహనం వేగం పెరిగిన  కొద్ది దృష్టిలో మార్పులు చోటు చేసుకుంటాయి.

సాధారణంగా గంటకు 40 కి.మీ వేగంతో వాహనం నడిపే వారు ఎంత మేరకు దృష్టి సారించగలరంటే 100 డీగ్రీల మేరకు సారించగలరు. అదే విదంగా 50 నుంచి 60 70 కి.మీటర్ల వేగంతో నడిపే వారు 75 డిగ్రీల కోణంలో చూడగలరు. ఇక 75 నుండి 100 కి.మీల వేగం అయితే దృష్టి 45 డిగ్రీల కోణంలో మాత్రమే ఉంటుంది. ఇక 100 పేనా 120 నుండి 130 కి.మీ వేగంతో నడిపే వారు అయితే కేవలం 30 డిగ్రీల కోణంలో మాత్రమే చూడ గలుగుతారు. వేగం పెరిగిన కొద్ది దృష్టి కోణం తగ్గుతుంది.  రోడ్డు వెంట పరిసరాల సమచారం మన దృష్టి వల్లే మనం గ్రహించగలుతాం.  వాహనం వేగం అనేది పరిసరాలను ఏమారుస్తుంది. అందువల్ల ఆక్సిడెంట్ల తీవ్రత అనేది వేగాన్ని బట్టి ఉంటుంది. సాధారాణ వేగంతో వెళ్లి నపుడు ఎంత పెద్ద ప్రమాద మైనా సులువుగా తప్పంచుకో వచ్చు లేదా తీవ్రత తగ్గేలా చేయవచ్చు అనేది పోలీసులు కల్పిస్తున్న అవగాహన. మితి మీరిన వేగం కన్నా పరిమిత వేగం ప్రాణాలను కాపాడుతుందని  ఈ నిభందనలు పాటిస్తే 90 శాతం వరకు ఆక్సెడెంట్లను అరికట్ట వచ్చని ఎడ్యుకేట్ చేస్తున్నారు.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతంలో ట్రాఫిక్ సమస్యల విషయంలో సీటు బెల్డు, హెల్మెట్ ధరించడం వంటి అంశాలతో పాటు ఇతర రోడ్ సేఫ్టీ నిభందనలపై  అందరికి అవగాహన కల్పించే రీతిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు