ఢిల్లీ సిఎం కూతురునే మోసం చేసి దొరికి పోయారు


 సైబర్ నేరగాళ్లకు ఎవరనేది ముఖ్యం కాదు. ఆన్లైన్ లో ఫ్రాడ్ చేయడమే వారి ధ్యేయం. ఏకంగా డిల్లీ సిఎం అరవింద్ కేజ్రి వాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసి ఆమె బ్యాంకు అక్కౌంట్ నుండి 34 వేల రూపాయలు కొట్టేసారు.  ఆ తర్వాత హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. మన్వేంద్ర,కపిల్,సాజిద్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అయితే అసలు ప్రధాన నిందితుడు  ఫరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.  అతని కోసం గాలిస్తున్నారు. 

ఫిబ్రవరి 7 వతేదీన హర్షిత కేజ్రీవాల్ ఓఎల్ ఎక్స్ ఆన్ లైన్  ద్వారా ఓ పాత సోఫా సెట్ ను అమ్మేందుకు ప్రయత్నించగా నిందితులు ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపారు. ముందు కొంత నగదు ఆమె అక్కౌంట్ కు బదిలి చేశాడు.  ఓ బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. ఫిబ్రవరి 8వ తేదీన హర్షిత వారు చెప్పినట్లే చేయడంతో  ఆమె అక్కౌంట్ నుండి రెండు విడుతలుగా రూ.20 వేలు మరో సారి రూ.14 వేలు కాజేసారు. దాంతో హర్షిత సివిల్ సైన్స్ పోలీస్ స్టేన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు.  

అందుకే జాగ్రత్తగా ఆన్లైన్ ట్రాన్ఝాక్షన్ల విషయంలో బాగా జాగరూకతతో ఉండాలి. బార్ కోడ్స్ లేదా ఇతరత్రా మనకు అర్దం కాని పద్దతుల్లో  బ్యాంకు అక్కౌంట్ల వివరాలు పొంది ఫ్రాడ్ చేస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు