ఉద్యమ ద్రోహులే కెటిఆర్ ను సిఎం చేయాలంటున్నారు - బండి సంజయ్

 ఉద్యమ కాలంలో కెటిఆర్ ఎక్కడున్నాడు ?
గతంలో ఇచ్చిన మాట ప్రకారం దళితున్ని సిఎం ను చేయాలన్న బండి సంజయ్
కెటిఆర్ సిఎం అయితే పార్టీలో విస్పోటనమే !


కెటిఆర్ సిఎం కావడం టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసలైన తెలంగాణ వాదులకు ఇష్టం లేదని  తెలంగాణ ఉద్యమ  ద్రోహులే కెటిఆర్ ను  సిఎం చేయాలని కోరుతున్నారని బిజెపి చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఒక వేళ కెసిఆర్ సిఎం పదవి నుంచి తప్పుుకంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారం దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు.

రామ మందిర్ నిర్మాణం కోసం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బుధవారం బండి సంజయ్ పార్టి అధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

సిఎం విషయం టిఆర్ఎస్ పార్టి అందర్గత విషయం అయినప్పటికి తెలంగాణ జన హితం కోసం దళితున్ని సిఎం చేయాలనేది తెలంగాణ ప్రజల అభిప్రాయమని అన్నారు.

కెటిఆర్ ను సిఎం చేస్తే పార్టీలో విస్ఫోటనం జరుగుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కెటిఆర్ ను సిఎం ను చేసేందుకు ఆయన ఉద్యమంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఉద్యమం లో మొదటి నుండి ఉన్న ఈటెల రాజేందర్, హీరశ్ రావు పరిస్థితి ఏంటని అన్నారు. ఈటెల రాజేందర్ ను సిఎం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

కెటిఆర్ సిఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కెసిఆర్ నిర్ణయించినట్లు కనిపిస్తోందని అందుకే ఆయన ఫాం హవుజ్ లో దోష నివారణ పూజలు నిర్వహించి పూజా సామాగ్రిని కలశాన్ని త్రివేణి సంగమంలో కలిపేందుకు  కాళేశ్వరం వెల్లాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టువి,యంలో కెసిఆర్ ప్రజలను మభ్య పెడుతున్నాడని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు