రెండో దశలో మోడీకి వాక్సిన్ -అప్పుడే ముఖ్యమంత్రులకు కూడా



వాక్సినేషన్ రెండో దశలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాక్సిన్ చేయించుకోనున్నారు.
ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు,కేంద్రమంత్రులు..బ్యూరోక్రాట్లు,, యాభై సంవత్సరాల వయసు పైబడిన ఉద్యోగులు వాక్సిన్ తీసుకుంటారు.
మొదటి దశలో వాక్సిన్ చేయించుకున్న వారెవరూ రెండో డోస్ ను విస్మరించవద్దని,అలాగే దేశ ప్రజలు ఎవరూ కూడా వాక్సిన్ పనితీరు పట్ల సందేహాలు పెట్టుకోవద్దని ప్రధాని కోరారు.
ప్రపంచంలో చైనా, ఇండియా,అమెరికా మాత్రమే 30 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశాలని చెబుతూ మొదటి దశలో మన దేశంలో మూడు కోట్ల మందికి వాక్సిన్
ఇస్తున్నామని,ఈ సంఖ్య వంద దేశాల జనాభా కంటే ఎక్కువని ప్రధాని అన్నారు.రెండో దశ పూర్తయ్యే నాటికి 30 కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు.
కాగా దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందనే ఆలోచనతో చాలా మంది వాక్సిన్ పట్ల ఆసక్తి కనబరచడం లేదు..అయితే ఈ ఆలోచన సరి కాదు..కరోనా ఒక మహమ్మారి..ఇలాంటివి ఎప్పుడు ఏ దశలో మరోసారి విరుచుకు పడుతుందో చెప్పలేం..అలాంటి మహమ్మారి పట్ల అది పూర్తిగా వెళ్లిపోయే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే.అలా దేశంలో కోవిడ్ నిర్మూలన పూర్తిగా జరగాలంటే అందుకు వాక్సిన్
ఒక్కటే మార్గం..ఇప్పుడున్న అంచనాల ప్రకారం 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 30 ,40 కోట్ల మందికి వాక్సినేషన్ జరిగితే సామూహిక ఇమ్యూనిటీ సాధ్యపడి కరోనా అంతానికి మార్గం సుగమం అవుతుంది.దేశ ప్రజలంతా వాక్సిన్ స్వచ్ఛందంగా చేయించుకుంటేనే అది జరుగుతుంది.
*ఇ.సురేష్ కుమార్*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు