దీప్ సిద్దూను శిబిరం నుండి తరిమి కొట్టిన రైతులు

ఎర్రకోట కిష్కింద కాండకు  సిద్ధూ భాద్యుడని నిల దీసిన రైతులు



 ట్రాక్టర్ ర్యాలీని దారి మళ్ళించి ఎర్ర కోట కిష్కింద కాండకు భాద్యుడైన పంజాబి నటుడు, గాయకుడు  దీప్ సిద్దూను రైతులు తమ శిబిరం నుండి తరిమి కొట్టారు. సిక్కుల మత జెండా అయిన నిషాన్ సాహిబ్ జెండాను ఎగుర వేయడం ద్వారా మొత్తం రైతు ఉద్యమానికి మచ్చ తీసుకు వచ్చిన   దీప్ సిద్ధూను రైతులు బుధవారంఇండస్ సరిహద్దు  శిబిరం  వద్ద చుట్టు ముట్టి నిల దీసారు.  కాసేపు అక్కడే ఉంటే దాడి తప్పదని గ్రహించిన సిద్ధూ అక్కడి నుండి కొద్ది దూరం పరుగెత్తి ఆ తర్వాత ఓ టూ వీలర్ పై ఫరారయ్యాడు. ఆయన వెనకాల పడి రైతులు తరిమి కొడుతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాహనంపై రాళ్ళు, చెప్పులు విసురుతూ వెంట పడి తరుముతున్న చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

నూతన వ్యవసాయ చట్టాలు ఉపసంహరించాలంటూ  ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేపట్టిన ఆందోళన 60 వ రోజుకు చేరువ కాబోతోంది. చారిత్రక మైన ఈ రైతు పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్ళి మొత్తం ప్రపంచానికి  చాటిన రైతుల ఉద్యమానికి మచ్చతెచ్చే రీతిలో దీప్ సిద్దూ రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీని దారి మళ్లించి కిష్కింద కాండకు భాద్యుడయ్యాడు. ట్రాక్టర్ ర్యాలీని కేవలం ఢిల్లీ సరిహద్దుల మీదుగా తీసుకెళతామని హామీ ఇస్తూ, రైతు సంఘాలు అనుమతి తీసుకోగా సిద్ధూ కారణంగా  పరిస్థితి మరోలా మారిపోయింది. 

ఇందుకు పూర్తిగా ఆయనే భాద్యుడనేది రైతు సంఘాలు ఆధారాలతో సహా రుజువు చేసాయి. గాయకుడిగా, సినిమా ఆక్టర్ గా మంచి పేరుతెచ్చుకున్న  దీప్ సిద్ధు రైతు ఉద్యమానికి తన పాపులారిటి జోడించి నాయకుడై పోవాలనే అత్యాశతో పథకం ప్రకారం ఎర్రకోట వైపు ర్యాలీని దారిమళ్ళించి రణరంగం చేశాడని రైతు సంఘాలు ఆరోపించాయి. వాస్తవంగా ట్రాక్టర్ ర్యాలి ముందుగా అనుమతులు పొందిన దారిలో కొనసాగింది. డిల్లీ ప్రజలు రైతుల ర్యాలీకి స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. అదే సమయంలో తన  రెచ్చ గొట్టే ప్రసంగాల ద్వారా ప్రేరణ పొందిన  కొంత మంది రైతులను దీప్ సిద్ధూ ఎర్ర కోట వైపు మళ్లించి తన ముందస్తు  ప్లాన్ మేరకు అక్కడి నుండి ఫేస్ బుక్ లో లైవ్ లో మాట్లాడారు. 

రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలు పూర్తిగా ముగిసే సమయానికి పరేడ్ గ్రౌండ్ నుండి కళాకారులు, ఇతర వర్గాల వారు  ఇంకా పూర్తిగా తొలిగి పోక ముందే రైతులు ట్రాక్టర్ల తో దూసుకు వచ్చి రణ రంగం చేశారు. ఈ తతంగమంతా పదే పదే చూపించి అసలు వాస్తవాలు చూపించకుండా మొత్తం రైతుల ర్యాలీని నిందిస్తూ మీడియా చేసిన హడావుడితో దేశ మంతా తప్పుడు సంకేతాలు వెల్లాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

  దీప్ సిద్ధూ వ్యవహారం పై రైతు సంఘాలు మండి పడ్డాయి. సన్నిడియోల్ తో కల్సి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో దీప్ సిద్దూ దిగిన ఫోటోలు కూడ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సిద్దూ ఏ పక్షం వాడో తెల్చుకోవాలంటూ ఇదంతా కావాలనే చేశాడని రైతు సంఘాలు సవాల్ చేశాయి. 

పోలీసుల విచారణలోకూడ సిద్దూ చేసిన నిర్వాకం ఆధారాలతో సహా బయట పడింది. దాదాపు అన్ని మీడియా ఛానెళ్ళలో సిద్ధూ ఎర్ర కోట కిష్కింద కాండ దృష్యాలు ఉన్నాయి. అంతే కాక ఆయన ఫేస్ బుక్ లో లైవ్ ప్రసంగం కూడ ఆధారం కావడంతో పోలీసులు ఆయనపై పలు కేసులు  నమోదు చేయక తప్పలేదు. ఇక సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేయక తప్పదంటున్నారు. పాకిస్తానా..ఖలిస్తానా కాశాయమా ఎవరు సిద్ధూ వెనకాల ఉండి చేయించారో పోలీసులు తేల్చాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు