కరోనా విశిష్ట సేవలకు డిఐజి సుమతికి ఉత్తమవారియర్ అవార్డు

 


కరోనా కష్టకాలంలో విధించిన లాక్ డౌన్ సమయంలో విశిష్ట సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన మహిళా సంరక్షణ విభాగం డీఐజీ  బి.సుమతి కేంద్ర ప్రభుత్వం నుండి  కోవిడ్ ఉత్తమ వారియర్ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జావడేకర్  చేతుల మీదుగా ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ 29వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అంద చేసారు. 

కోవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించిన పలు రంగాలకు చెందిన మహిళలను జాతీయ మహిళల కమిషన్ ఎంపిక చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుండి బడుగుల సుమతి కూడ ఉన్నారు.  కరోనా లాక్ డౌన్ సమయంలో పోలీసు అధికారిగా సుమతి హైదరాబాద్ నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులైన ఆహార ధాన్యాలు, మందులు, రవాణా తదితర అవసరాలకు ఏ విధమైన లోటు రాకుండా ప్రభుత్వ శాఖలతో పాటు 90 స్వచ్ఛంద సంస్థల సహాయంతో సహాయక చర్యలు ఏర్పాటు చేసారు. వలస కూలీల సహాయం, కోవిడ్ నియమావళి కట్టు దిట్టంగా అమలు చేయడం, వైద్యులు, వైద్య సిబ్బంది 24 /7 అందుబాటులో ఉంచేందు కోసం రూపొందించిన సేవా యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించడంలో సుమతి కీలక పాత్ర వహించారు. ప్రధానంగా గృహం హింసకుసంభందించి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకక ఏర్పాట్లు చేసారు. డయల్ 100 కు వచ్చిన కాల్స్ కు వెంటనే స్పందించేందుకు 24 మంది సైకాలజిస్టులను నియమించారు. సహాయం కోరిన వారికి తక్షణం అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చారు.

సూర్యాపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు మార్తమ్మకు అవార్డు 

తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన పారిశుద్య కార్మికురాలు మార్తమ్మ   ఆవార్డు అందుకున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న  లాక్ డౌన్ కాలంలో ఒక్క రోజు కూడ సెలవు పెట్టకుండా విధులు నిర్వహించినందుకు గాను మార్తమ్మకు ఆవార్డు అంద చేశారు. కరోనా వ్యాధులు సోకిన రెడ్ జోన్లలో సైతం మార్తమ్మ  విధులు నిర్వహించారు. మార్తమ్మ గత 15 సంవత్సరాలుగా ఆవుట్ సోర్సింగ్ కార్మికురాలిగా సేవలు అందిస్తోంది. ఆమెకు ప్రశంసా పత్రం అంద చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు