త్వరలో నాసల్ వాక్సిన్ -కేంద్ర మంత్రి హర్షవర్దన్


అది వచ్చేస్తే
కరోనా కథ ఖతం!మన దేశంలో నాసల్ వాక్సిన్ త్వరలోనే వస్తుందని,అది వచ్చాక మనం కరోనాను పూర్తిగా
జయించగలుగుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.ఈ వాక్సిన్ మొదటి రెండు దశల ప్రయోగాలు త్వరలోనే మొదలు కానున్నాయని ఆయన తెలిపారు.
ఈలోగా ప్రజలు మన ప్రభుత్వం అందిస్తున్న రెండు సురక్షిత వాక్సిన్లను పూర్తిగా విశ్వసించి వాక్సినేషన్ కార్యక్రమంలో పరిపూర్ణ నమ్మకంతో పాల్గొనాలని మంత్రి కోరారు.గత నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 454049 మందికి వాక్సిన్ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు..ఎక్కడా పెద్దగా అవాంచనీయ పరిణామాలు చోటు చేసుకోలేదని చెప్పారు.
మన దేశం మిత్ర దేశాలు ఆరింటికి వాక్సిన్ సరఫరా చేయనుందని...మూడు దేశాలకు రేపటి నుంచి పంపిణీ మొదలవుతుందని మంత్రి చెప్పారు.దేశంలో కొత్త కేసులు..మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.
ఇ.సురేష్ కుమార్
19.01.21..9.10 pm

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు