హెచ్ వన్ బీ వీసాల నిషేధం చెల్లదు - యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు

 


ట్రంప్ కాలంలో భారతీయిలు ఎదుర్కున్న కష్టాలు ఒక్కొక్కటి తొలిగి పోయేందుకు మార్గం సుగమం అవుతోంది. హెచ్ వన్ బీ వీసాల విషయంలో  ట్రంప్‌ ప్రభుత్వం విధించిన ఆంక్షలు చెల్లనేరవని   కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ కొట్టి పడేసారు. ఆంక్షల విషయంలో ట్రంప్ విధానాలు సరిగా పాటించలేదని కరోనా కాలంలో ఎదురైన  నష్టాలను అధిగమించేందుకు అని చెప్పడం సరికాదని కోర్టు పేర్కొంది.  కరోనా ప్రారంభంనాటికి ముందే ట్రంప్ ఇలాంటి అసంబద్ద మైన ఆలోచనలతో ఉన్నారని కోర్టు తప్పు పట్టింది. విదేశీయులు అమెరికాకు రావడాన్ని అడ్డు కునేందుకు అట్లాగే ఎన్నికల్లో ఇాలంటి ఎత్తుగడలతో మెప్పు పొందాలని ట్రంప్ సర్కార్ అక్టోబర్ లో హెచ్ వన్ బీ వీసాలను ఖఠిన తరం చేస్తు ఆంక్షలు విధించింది ఈ ఆంక్షల కారణంగా ఐటి కంపెనీలు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశాయి.  హెచ్ వన్ బి వీసాలపై ధర్డ్ పార్టి నియామకాలలో ఏడాది కాలం పాటు నిషేదం విధించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్‌, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పలు సంస్థలు ట్రంప్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ  కోర్టులో సవాల్చేసాయి. అమెరికా ప్రతి ఏటా మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజి రంగాలలో  85 వేల మందికి వీసాలు జారి చేస్తుంది. మూడేళ్ళ పాటు ఉండే వీసా కాల పరిమితిని అవసరమైతే  రెన్యువల్ ద్వారా పొడిగించుకోవచ్చు.  అమెరికాలో సుమారు 4 లక్షల మంది వరకు ఇండియన్లు ఇట్లా హెచ్ వన్ బీ వీసాలపై వెళ్లిన వారున్నారు. చైనా నుండి కూడ లక్షల్లో  ఉన్నారు.  

అమెరికాలో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ వీసాల ఆంక్షల విషయంలో సడలింపులు ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి.   ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఆంక్షలు ఎత్తి వేయనున్నారు. ఎన్నికల సమయంలో ఆయన హామీలలో హెచ్ వన్ బీ వీసాల హామి కూడ ఉంది. కోర్టు తీర్పు కూడ అనుకూలంగా  వెలువడడంతో  ఇక హెచ్ వన్ బీ వీసాల విషయంలో భారతీయలు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు.  గ్రీన్ కార్డు జారి విషయంలో  కొత్తగా ఎన్నికైన  అధ్యక్షులు జో బైడెన్ విదేశీయుల పట్ల ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశ వాసుల పట్ల స్పష్టమైన వైఖరి కలిగి వారికి తోడ్పడేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఆంక్షలు సడలించి వీసాలు పునరుద్దరించడం వల్ల భారత్ వంటి దేశాలకు చాలా అవకాశాలు లభించ నున్నాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు